విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు | Three boys goes missing from the Vizag beach | Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు

May 28 2015 3:53 PM | Updated on Sep 3 2017 2:50 AM

విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు

విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు

విశాఖజిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న ముగ్గుర్ని ఒక్కసారిగా వచ్చిన రాకాసి అల మింగేసింది.

విశాఖపట్నం : విశాఖజిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న ముగ్గుర్ని ఒక్కసారిగా వచ్చిన రాకాసి అల మింగేసింది. ఈ ఘటనలో లోకేష్(19), రాజు(18), విజయ్(20) అనే ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో సుమారు పది మంది స్నేహితులు ఆ తీరంలో ఉన్నారు. అందులో ముగ్గురు స్నానానికి దిగారు. ఒక్కసారిగా వచ్చిన అల ముగ్గురిని సముద్రంలోకి లాక్కెళ్లింది. కళ్లముందే స్నేహితులు గల్లంతవటంతో మిగతా వారు కన్నీరుమున్నీరవుతున్నారు. గల్లంతయిన వారి కోసం 10 మంది గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement