వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of Married women | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Dec 31 2015 8:47 AM | Updated on Sep 3 2017 2:53 PM

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాలివీ...గ్రామానికి చెందిన నాగభూషణ రావుకు ప్రమీల(19)తో 10 నెలల క్రితం వివాహమైంది. బుధవారం రాత్రి ఇంట్లో భర్త లేని సమయంలో తన గదిలో ప్రమీల ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన భర్త ఆమె ఉరిని తప్పించి కిందికి దించాడు. అయితే, అప్పటికే ప్రమీల చనిపోయింది.

ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకున్నారు. గత రెండు నెలలుగా అత్తింటి వారు ప్రమీలను కట్నం కోసం వేధిస్తున్నారని తండ్రి గౌరి నాయుడు తెలిపారు. బుధవారం కూడా ఆమె ఫోన్ చేసి తనను అత్తమామలతోపాటు మరిది కూడా వేధిస్తున్నట్లు చెప్పిందని ఆయన అన్నారు. వాళ్లే ఆమెను చంపి ఉరేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement