యువతి అనుమానాస్పద మృతి | The mysterious death of a young woman | Sakshi
Sakshi News home page

యువతి అనుమానాస్పద మృతి

Jan 4 2016 3:22 PM | Updated on Sep 3 2017 3:05 PM

భామిని మండలం ఘనసరలో సుమతి(20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం గణచర గ్రామానికి చెందిన సుమతి(20) అనే యువతి సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కాగా.. ఇదివరకే సుమతి తండ్రి మృతి చెందాడు. తల్లి అనారోగ్యంతో మంచానపడింది. సుమతి కూలిపనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. సోమవారం మధ్యాహ్నం సుమతి గ్రామ శివారులోని పౌరసరఫరాల శాఖ గోదాము సమీపంలో శవమై పడిఉండటాన్ని గ్రామస్తులు కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భామిని పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement