జిల్లాకు లోటు : మంత్రి సునీత | The district deficit: minister replied | Sakshi
Sakshi News home page

జిల్లాకు లోటు : మంత్రి సునీత

Jan 11 2015 3:36 AM | Updated on Sep 2 2017 7:30 PM

జిల్లాకు లోటు : మంత్రి సునీత

జిల్లాకు లోటు : మంత్రి సునీత

జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ బదిలీ జిల్లాకు లోటు అని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

అనంతపురం సెంట్రల్ : జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ బదిలీ జిల్లాకు లోటు అని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం డ్వామా హాలులో జిల్లా యంత్రాంగం, బ్యాంకర్ల ఆధ్వర్యంలో జేసీ సన్మానించారు. మంత్రి సునీత మాట్లాడుతూ...జేసీ సత్యనారాయణ బదిలీపై వెళుతుండడంతో ఇంటిలోని వ్యక్తి బయటకు పోతున్నట్లుగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారన్నారు. ఎక్కడున్నా జిల్లా సంక్షేమం గురించి పట్టించుకోవాలని కోరారు.

మళ్లీ జిల్లాకు తెప్పించుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ఉద్యోగులందరూ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణను అభినందించారు. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీన్, ఏపీజీపీ ఆర్‌ఎం నరసయ్య, ఎల్‌డీఎం జయశంకర్, నాబార్డు జీఎం నరసింహరావు  పాల్గొన్నారు.
 
జేసీకి ఏపీజీబీ ఆర్‌ఎం సన్మానం
అనంతపురం అగ్రికల్చర్: తూర్పుగోదా వరి జిల్లాకు బదిలీ అయిన జిల్లా జా యింట్ కలెక్టర్ బి.సత్యనారాయణను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారులు ఘనంగా సన్మానించారు. శని వారం స్థానిక రీజనల్ మేనేజర్ కార్యాలయంలో ఆర్‌ఎం లక్ష్మీనరసయ్య, ఇత ర అధికారులు సత్యనారాయణకు శాలు వా, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. జేసీగా సమర్థవంతంగా పని చేశారని కొనియాడారు. కలెక్టర్ లేని లోటును కనబడకుండా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపించారన్నారు. ఎక్కడున్నా మంచి అధికారిగా అందరి మన్ననలు పొందాలని అకాంక్షను వ్యక్తం చేశారు.
 
జేసీకి ఘన వీడ్కోలు

అనంతపురం సెంట్రల్ : జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు జిల్లా ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రెవెన్యూ భవన్‌లో వీడ్కోలు సభ  నిర్వహించారు.  డీఆర్వో హేమసాగర్ మాట్లాడుతూ... జేసీ సత్యనారాయణ లేని లోటు ఈ జిల్లాకు తీరనది అన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చిన ముందుండి  పరిష్కరించే వారని గుర్తు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ దంపతులను అధికారులందరూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విందులో అధికారులతో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement