స్వల్ప వివాదంతో తలెత్తిన ఘర్షణ ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కృష్ణా జిల్లా, కంకిపాడు మండలంలోని పునాదిపాడులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
- కొడుకును టీవీఎస్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తున్న వ్యక్తిపై సైక్లిస్ట్ దాడి
- చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కంకిపాడు : స్వల్ప వివాదంతో తలెత్తిన ఘర్షణ ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కృష్ణా జిల్లా, కంకిపాడు మండలంలోని పునాదిపాడులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సీసీ కెమేరాలో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంకిపాడు మండలంలోని కోలవెన్నుకు చెందిన కొల్లూరి సాంబశివరావు(38)తన చిన్న కుమారుడు పావన్‌కు జ్వరంగా ఉండటంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లేందుకు టీవీఎస్‌పై శుక్రవారం రాత్రి బయలుదేరాడు.
ఈ క్రమంలో సైకిల్‌పై రోడ్డు దాటుతున్న దేవరపల్లి కిరణ్ అడుపడడంతో వారి మధ్య వాగ్వాదం జరిగి కిరణ్ సాంబశివరావుపై తీవ్రంగా దాడి చేయడంతో కుప్పకూలాడు. కుటుంబీకులు బాధితుడ్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం సాంబశివరావు మృతి చెందాడు.