వంశధార కాల్వ పనుల వద్ద ఉద్రిక్తత | tension at vamsadhara project in srikakulam district | Sakshi
Sakshi News home page

వంశధార కాల్వ పనుల వద్ద ఉద్రిక్తత

May 25 2016 12:18 PM | Updated on Sep 4 2017 12:55 AM

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనబద్ర కాలనీ వద్ద వంశధార రిజర్వాయరు వరదకాల్వ పనులను బుధవారం ఉదయం స్థానికులు అడ్డుకున్నారు.

కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనబద్ర కాలనీ వద్ద వంశధార రిజర్వాయరు వరదకాల్వ పనులను బుధవారం ఉదయం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ కాలనీని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ గ్రామస్తులతో చర్చించారు. ఇంజనీరింగ్ అధికారులతో సర్వే చేయించి ముంపు ప్రాంతం అని తేలితే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement