కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం | telangana reconstruction possible with kcr says koppula harishwar reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం

Mar 6 2014 11:16 PM | Updated on Mar 28 2018 10:59 AM

తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు.

 పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో తెలంగాణ పునర్నిర్మాణం అంశంపై యువకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ బిల్లుపెడితే బీజేపీ మద్దతిచ్చిందన్నారు. పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకునేందుకు నానా తంటాలు పడిన చంద్రబాబు.. ఇప్పుడు తాము లేఖ ఇవ్వటం వల్లే తెలంగాణ వచ్చిందటం హాస్యాస్పదమన్నారు. దశాబ్దాలపాటు వెనకబాటుకు గురైన తెలంగాణకు ప్యాకేజి ఇవ్వాలన్నారు.

 టీఆర్‌ఎస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినంతనే పోరా టం ఆగదని, ఈ ప్రాంత అభివృద్ది కోసం మరి న్ని పోరాటాలు అవసరమన్నారు. కార్యక్రమం లో ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ రౌతు కనకయ్య, పరిగి సర్పంచ్ విజయమాల, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబాయ్య, మాజీ ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సురేందర్, పరిగి, కుల్కచర్ల మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పరిగి పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి సునంద బుగ్గన్నయాదవ్, నాయకులు అనూష, రాములు, సురేష్, రాంచంద్రయ్య పాల్గొన్నా రు. అనంతరం కుల్కచర్ల మండల పరిధిలోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో టీడీపీ కుల్కచర్ల మం డల అధ్యక్షుడు శివరాజ్ తదితరులు న్నారు.

 మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి
 అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్‌లో చైర్మన్ స్థానాన్ని సాధించి సత్తా చాటాలని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో గురువారం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  కనకయ్య,  నాయ కులు కృష్ణయ్య, యాదగిరి యాదవ్, శంకర్, సత్యనారాయణరెడ్డి, వేమారెడ్డి తదితరులు న్నారు.

 టీఆర్‌ఎస్ కండువాతో శుభప్రద్ పటేల్
 విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ ఈ సమావేశంలో గులాబీ కండువాతో కనిపించడం చర్చంనీయాంశమైంది, వికారాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌నుంచి శుభప్రద్ పోటీ చేస్తున్నారన్న గుసగుసలు వినపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement