తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: గంటా | Telangana government should clarify stand on Fee Reimbursements, says ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: గంటా

Jun 18 2014 2:30 PM | Updated on Sep 2 2017 9:00 AM

ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ :  ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యార్థుల స్థానికతను ఎలా నిర్థారిస్తారో చెప్పాలని ఆయన అన్నారు. సీమాంధ్ర విద్యార్థులు ఎక్కడున్నా ఫీజులు చెల్లిస్తామని గంటా తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. గంటా బుధవారం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రాంతాలను నిర్ణయించింది.

*విశాఖలో ఐఐఎం, ఐఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ.
*విజయవాడ - గుంటూరు మధ్య ఎయిమ్స్, నిట్.. అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఎన్డీఎంఏ.
*తిరుపతి  - సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్.
ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు ఒక్కో జిల్లాలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్ తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement