తెలుగు తమ్ముళ్ల కక్కుర్తి | tdp workers collect money from cyclone victims | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల కక్కుర్తి

Oct 23 2014 1:31 PM | Updated on Aug 10 2018 6:50 PM

హుదూద్ తుపాను విలయానికి అన్ని కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న బాధితులనూ టీడీపీ కార్యకర్తలు వదలడం లేదు.

శ్రీకాకుళం: హుదూద్ తుపాను విలయానికి అన్ని కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న బాధితులనూ టీడీపీ కార్యకర్తలు వదలడం లేదు. తుపాను సాయంలోనూ కక్కుర్తి బుద్ధి చూపిస్తున్నారు. తుపాన్ సాయం అందించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. రేషన్ సరుకులు ఇచ్చేందుకు బాధితుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని కోనంగిపాడు, మగ్గూరు, ఇరువాడలో ఒక్కొక్కరి నుంచి రూ. 20 చొప్పున వసూలు చేశారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వమని పంపిన రేషన్ సరుకులను స్వాధీనం చేసుకుని వారీ దందాకు పాల్పడ్డారు. అసలే కష్టాల్లో ఉన్న తమను టీడీపీ కార్యకర్తలు డబ్బు కోసం వేధించడంపై బాధితులు మండిపడుతున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement