టీడీపీ సభ్యత్వాల్లో జిల్లాకు ప్రథమస్థానం : పర్వత | TDP subscriptions first importance in district | Sakshi
Sakshi News home page

టీడీపీ సభ్యత్వాల్లో జిల్లాకు ప్రథమస్థానం : పర్వత

Jan 5 2015 12:08 AM | Updated on Aug 10 2018 6:49 PM

టీడీపీ సభ్యత్వాల్లో జిల్లాకు ప్రథమస్థానం : పర్వత - Sakshi

టీడీపీ సభ్యత్వాల్లో జిల్లాకు ప్రథమస్థానం : పర్వత

సభ్యత్వ నమోదులో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని ఆ పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పర్వత చిట్టిబాబు చెప్పారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ సభ్యత్వ నమోదులో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని ఆ పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పర్వత చిట్టిబాబు చెప్పారు. ఆదివారం రాత్రి కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం రెండులక్షల 70వేల సభ్యత్వాలు లక్ష్యంగా నిర్ణయించగా 3.74 లక్షలు నమోదు చేశామని చెప్పారు. యువతతోపాటు మహిళలు సభ్యత్వాలు తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారన్నారు. జిల్లాలో సభ్యత్వాల నమోదు ద్వారా రూ.మూడు కోట్ల 79 లక్షలు సమకూరిందని, సభ్యత్వం తీసుకున్న ప్రతివారికీ ప్రమాదబీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. వచ్చే నెలాఖరుకల్లా జిల్లాలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్‌గా నియమించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తానని చెప్పారు. కార్యాలయ కార్యదర్శి మందాల గంగసూర్యనారాయణ, ఉల్లి రాజబాబు, కత్తిపూడి శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement