టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే, తమ వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని వైఎస్ఆర్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం బత్తలాపురంలో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే, తమ వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని వైఎస్ఆర్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 15 మంది వైఎస్ఆర్‌సీపీ, 9 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.