టీడీపీ మార్క్ రాజకీయం! | TDP leaders Mark politics in pusapatirega | Sakshi
Sakshi News home page

టీడీపీ మార్క్ రాజకీయం!

Sep 4 2014 2:03 AM | Updated on Sep 22 2018 8:22 PM

మండలంలో టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అధికారం తమ చేతిలో ఉండడంతో వారికి నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు

పూసపాటిరేగ: మండలంలో టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అధికారం తమ చేతిలో ఉండడంతో వారికి నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఉన్న వారిని తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాక్షర్‌భారత్ మండల కోఆర్డినేటర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధికార పార్టీ నాయకులు తమ అనుచరులను ఉద్యోగా ల్లో నియమించేందుకు అధికారులపై ఒత్తిడి తీ సుకువచ్చి తమంతట తామే స్వచ్ఛందంగా ఉ ద్యోగానికి రాజీనామా చేసేలా చేస్తున్నారు.అధికారపార్టీకి చెందినవారిని వదిలేసి మిగతా వారి పై వేటు వేయడానికి ఇప్పటికే జాబితా కూడా సిద్ధంచేశారు.
 
 అందులో భాగంగానే ముందుగా సాక్షర్‌భారత్ గ్రామ సమన్వయకర్తలను తొ లగిస్తున్నారు. మండలంలో మొత్తం 56 మంది గ్రామ సమన్వయకర్తలు అందులో అధికార పార్టీకి చెందిన 11మంది మినహా, మిగతా 45మందిపై వేటు వేయడానికి రంగం సిద్ధమైం ది. 45 మందిలో ఇప్పటికే వివిధ కారణాలతో ఐదుగురు సస్పెన్షన్‌లో ఉన్నారు. దీంతో మిగ తా వారిని తొలగించేందుకు టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఎనిమిది నెలలుగా గౌరవ వేతనాలు విడుదల కాక సమన్వయకర్తలు ఆర్థికంగా ఇబ్బందు లు పడుతున్నా రు. ఈ నేపథ్యంలో అధికారుల ఒత్తిడి ఎక్కువ్వడంతో పని చేయడం కష్టమేనని చెబుతున్నారు. కొన్ని రోజలు క్రితం రేషన్ డీలర్లపై కూడా ఇదే విధానం అవలంభించి పలువురు డీలర్లను తొలగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement