ఆధార్‌తో తెగిన లింకు | T broken link in Aadhaar card | Sakshi
Sakshi News home page

ఆధార్‌తో తెగిన లింకు

Mar 3 2014 12:33 AM | Updated on Sep 2 2018 5:20 PM

ఆధార్‌తో తెగిన లింకు - Sakshi

ఆధార్‌తో తెగిన లింకు

వంట గ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న కష్టాలు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఆధార్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా పెడచెవిన పెట్టిన కేంద్రం..

  •    నేరుగా వంట గ్యాస్ సబ్సిడీ
  •      కేంద్ర మంత్రిమండలి నిర్ణయం
  •      వినియోగదారులకు ఊరట
  •  వంట గ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న కష్టాలు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఆధార్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా పెడచెవిన పెట్టిన కేంద్రం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తలొగ్గింది. ఆధార్‌తో నిమిత్తం లేకుండా వినియోగదారులకు నేరుగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర మంత్రిమండలి శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆధార్ కార్డు ఉన్నవారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్న సబ్సిడీ ఇక నుంచి నేరుగా అందనుంది.   
     
     కనెక్షన్ల వివరాలిలా...


     జిల్లా వ్యాప్తంగా అన్ని గ్యాస్ కంపెనీలకు చెందిన వంట గ్యాస్ కనెక్షన్లు 6.24లక్షలు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు 3.75 లక్షల మంది వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేయించారు. వీరిలో 2.31లక్షల మంది వినియోగదారుల సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో ఫిబ్రవరి 1నుంచి గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం అమలవుతోంది. కానీ ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకున్న వారికి కూడా బ్యాంకు ఖాతాలలో సబ్సిడీ డబ్బుల జమ కాకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  కేంద్ర మంత్రి మండలి నిర్ణయంతో వీరికి ఊరట కలిగింది.
     
     పది రోజుల్లో అమలు?


     కేంద్ర మంత్రిమండలి తన నిర్ణయాన్ని  గ్యాస్ కంపెనీలకు లిఖిత పూర్వకంగా అందించాయి. ఇది మరో పది రోజుల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ కంపెనీలు నగదు బదిలీ పథకానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను లోడ్ చేసుకోవడం వల్ల ఇంతకాలం పాటు ఆధార్ లింకేజీ తోనే సరఫరా చేశారు. కాగా పాత పద్ధతిలో గ్యాస్ రీఫిల్లింగ్ చేయనున్నందున తిరిగి సాఫ్ట్‌వేర్‌ను లోడ్ చేయటానికి పది రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు,ఆయా కంపెనీల డీలర్లు పేర్కొం టున్నారు.
     
     నేరుగా సబ్సిడీ


     ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసుకున్న వినియోగదారులు ఒక్క గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు రూ.1220 చెల్లిం చాల్సి వచ్చేది. ఆధార్ లింకు లేకుండా అయితే 445 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్, బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసుకున్న వారికి ప్రభుత్వ సబ్సిడీ రూ.737 బ్యాంకు ఖాతా ద్వారా చెల్లిస్తున్నారు. అయినా వినియోగదారుడు రూ.40 నష్టపోతున్నారు. పాత పద్ధతిలోనే నేరుగా వినియోగదారుడి సబ్సిడీ అందితే రూ. 445కే  గ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్ వచ్చే అవకాశాలున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement