శ్రీకాకుళం మాజీ ఎస్పీకి మళ్లీ పోస్టింగ్‌!

Suspended Srikakulam SP Adapa Venkataratnam Has been Appointed As AP TransCo Chief - Sakshi

అమరావతి: శ్రీకాకుళం మాజీ ఎస్పీ అడపా వెంకటరత్నంకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్‌ ఇచ్చింది. డెప్యూటేషన్‌పై ఏపీ ట్రాన్స్‌కోకు వెంకటరత్నంను బదిలీ చేసింది. ఏపీ ట్రాన్స్‌కో చీఫ్‌, విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెంకటరత్నంను నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెంకటరత్నంపై తీవ్రంగా రావడంతో ఎన్నికల కమిషన్‌ ఆయనను ఆకస్మికంగా విధుల నుంచి తప్పించిన సంగతి తెల్సిందే.

అప్పటి నుంచి వెంకటరత్నం ఖాళీగా ఉన్నారు. తనను అన్యాయంగా బదిలీ చేశారంటూ గతంలో ఈసీకి వెంకటరత్నం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలు ముగియడంతో తిరిగి వెంకటరత్నంకు పోస్టింగ్‌ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top