జిల్లా పంచాయతీ అధికారిగా సురేష్‌బాబు రానున్నట్లు సమాచారం. ఇంతకుముందు డీపీఓగా పనిచేసిన మునావర్ మూడు నెలల క్రితం పదవీ విరమణ చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పంచాయతీ అధికారిగా సురేష్‌బాబు రానున్నట్లు సమాచారం. ఇంతకుముందు డీపీఓగా పనిచేసిన మునావర్ మూడు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. దీంతో ఆ పోస్టులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ వరప్రసాద్‌రెడ్డి ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ పోస్టుకోసం గతంలో పనిచేసిన ఈఎస్ నాయక్‌తోపాటు మరో అధికారి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నగరీకరణ నేపథ్యంలో జిల్లా పంచాయతీ శాఖ కీలకంగా మారిన తరుణంలో సమర్థ అధికారిని తీసుకురావాలనే ఉద్దేశంతో సురేష్‌బాబు పేరును కలెక్టర్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇందుకు మంత్రి ప్రసాద్‌కుమార్ సానుకూలంగా స్పందించడంతో ఆయనరాక ఖాయమేనని సమాచారం. సురేష్‌బాబు నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నారు.