ఇసుక ర్యాంపుపై సబ్‌కలెక్టర్ దాడి | sub collector attacks on sand ramp | Sakshi
Sakshi News home page

ఇసుక ర్యాంపుపై సబ్‌కలెక్టర్ దాడి

Apr 30 2016 10:26 AM | Updated on Aug 28 2018 8:41 PM

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుతున్న రెండు జేసీబీలను అధికారులు సీజ్ చేశారు.

రాజమహేంద్రవరం రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుతున్న రెండు జేసీబీలను అధికారులు సీజ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కాతేరు ఇసుక ర్యాంపుపై శనివారం ఉదయం సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్, రెవెన్యూ అధికారులతో కలసి దాడులు చేశారు. ఈ సందర్భంగా రెండు జేసీబీలతో పాటు 14 లారీలను, రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. సంబంధీకులపై కేసులు నమోదుకు పోలీసులను ఆదేశించారు. ర్యాంపులో కార్మికులతో మాత్రమే ఇసుక తవ్వాలని, యంత్రాలను వినియోగించరాదనే నిబంధనలున్నాయని అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement