విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించాలి | Students target greatest empire says kavitha | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించాలి

Jan 24 2014 6:52 AM | Updated on Nov 9 2018 4:19 PM

తెలంగాణ విద్యార్థులంటే సూపర్ పవర్ అని.. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ భాగమవ్వాలని, అలాగే తమ విద్యాలక్ష్యాలను చేరుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నా రు.

 ఖలీల్‌వాడీ, న్యూస్‌లైన్: తెలంగాణ విద్యార్థులంటే సూపర్ పవర్ అని.. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ భాగమవ్వాలని, అలాగే తమ విద్యాలక్ష్యాలను చేరుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఎల్‌ఎన్ గార్డెన్‌లో గురువారం ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర’ అంశంపై జాగృతి విద్యార్థి విభాగం నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ముందుగా నేతాజీ, అంబేద్కర్, జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న తెలంగాణలో ప్రతీవిద్యార్థి తమకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు. ప్రత్యేకరాష్ట్రంలో విద్య, ఉద్యోగ ని యామకాలకు పెద్దపీఠ ఉంటుందని చెప్పారు.
 
 పొడిగించినా పర్వాలేదు..
 రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై చర్చకు గడువును మరోవారం పొడిగించినా పర్వాలేదని, ఈనెల 30లోపు బిల్లు ఆమోదం పొందితే చాలని కవిత అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ అవరణలో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. జాగృతి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణను బంగారు  రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామన్నారు. సదస్సులో రాతిబొమ్మలోన కొలువైన శివుడా.. ఫేం సాయిచంద్ చేపట్టిన ధూంధాం విద్యార్థులను అలరించింది. జాగృతి రాష్ట్ర నాయకులు తిరుపతిరావు, నవీన్‌చారి, అవంతి,ప్రవీణ్, సాయినాథ్, లక్ష్మీనారాయణ, మనోజ్, సాయిలవోలా, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జులు బస్వా లక్ష్మీనర్సయ్య, జీవన్‌రెడ్డి, నాయకులు న్యాలం కిషన్, డాక్టర్ సతీష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement