హోటల్ నుంచి ‘మధ్యాహ్న భోజనం’ | Students from primary level | Sakshi
Sakshi News home page

హోటల్ నుంచి ‘మధ్యాహ్న భోజనం’

Nov 16 2014 1:50 AM | Updated on Sep 2 2017 4:31 PM

ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల కు ఉచి తంగా పోషక విలువలతో కూడిన భోజనం అందించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల

 రాజాంరూరల్ : ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల కు ఉచి తంగా పోషక విలువలతో కూడిన భోజనం అందించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సదాశయానికి గండిపడుతోం ది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మండ ల పరిధిలోని వీఆర్ అగ్రహారం ఎస్సీ కాల నీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని హోట ల్ నుంచి తెప్పిస్తున్నారు. మూడేళ్లుగా వం ట ఏజెన్సీల మధ్య వివాదం చెలరేగుతోం ది. రాజ కీయ కక్షల నడుమ పథకాన్ని భ్రష్టుపట్టించారు. విద్యార్థుల తల్లిదండ్రుల వర్గం ఒకటైతే, అధికార పార్టీ వర్గం మరొక గ్రూపుగా తయారయ్యాయి.
 
 ఎన్నో ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తోన్న సంఘాన్ని వంటలు బాగోలేదంటూ మూ డేళ్ల క్రితం వివాదం రేపి విద్యార్థులు భోజ నం చేయకుండా నిలిపివేశారు. దీంతో చేసేదేమీ లేక హెచ్‌ఎం కె.జయ ఇరువర్గాలను శాంతపరిచి ఆరు నెలలు పాటు ఒక్కో వర్గం మధ్యాహ్న పథకంలో వంట చేయాల ని సూచించారు. ఆ ఏడాది రెండు వర్గాలు ఒప్పుకుని వంట చేశాయి. గత ఏడాది మరోమారు ఈ వివాదం చెలరేగడంతో మండల స్థాయి అధికారులంతా గుమిగూ డి మూడేసి నెలల చొప్పున ఒక్కో వర్గం వంట చేయాలని తీర్పు చెప్పడంతో వివా దం సద్దు మణిగింది. ఈ ఏడాది మళ్లీ వివా దం చెలరేగింది. అధికార పార్టీ వర్గం వంట చేస్తే విద్యార్థులు భోజనాలు చేయరని, అవసరమైతే స్కూల్‌కి పిల్లలను పం పించమని ప్రత్యర్థి వర్గం తెగేసి చెప్పింది.
 
 దీంతో వం ట ఆగి పోయింది. అయితే ఎంఈవో జి. మంజుల ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి పాఠశాల హెచ్‌ఎం తన సొంత నిధులతో రోజుకి రూ.240 చొ ప్పున వెచ్చించి రాజాంలోని హోటల్ నుంచి భోజనాళ్ల పార్శిల్ తెప్పించి విధ్యార్థులకు పెడుతున్నా రు. ఇంకెన్నాళ్లు ఇలా పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.4.35 మంజూరు చేస్తోందని, పాఠశాలలో 19 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరందరికీ కలిపి భోజనం వడ్డిస్తే ప్రభుత్వం రూ 82.65 మంజూరు చేస్తుందని, ఖర్చు మాత్రం రూ.240 అవుతోందని హెచ్‌ఎం అన్నారు. విద్యార్థులకు కూడా అరకొరగా భోజనం అందుతోంది. దీంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి పాఠశాలలో సక్రమంగా మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
 
 హోటల్ నుంచి తెప్పించడం భారమే
 రోజూ హోటళ్ల నుంచి సొంత నిధులతో భోజనాలు తెప్పించలేక ఇబ్బంది పడుతున్నాం. వంట ఏజెన్సీలు మా మాట వినటం లేదు. ఉన్నతాధికారులే పరిష్కరించాలి.
 కె.జయ, హెచ్‌ఎం.
 ఆకలి తీరడం లేదు
 హోటళ్ల నుంచి తెస్తున్న పార్శిల్ భోజనం అందరికీ సరిపోవడం లేదు. సాయంత్రం వరకూ అర్ధాకలితోనే అలమటిస్తున్నాం.
 
 -షేక్ ఆయుష, 5వ తరగతి,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement