ఈత రాకపోయినా సరదా కొద్దీ బావిలోకి దిగిన ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు.
గోనెగండ్ల : ఈత రాకపోయినా సరదా కొద్దీ బావిలోకి దిగిన ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పుద్దపాశం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పుద్దపాశం గ్రామానికి చెందిన సోమనాయుడు అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థి శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని బావి దగ్గరికి ఈతకని వెళ్లాడు. స్నేహితులు బావలో ఈత కొడుతుంటే సరదా పడిన సోమనాయుడు ఈత రాకపోయినా బావిలోకి దిగి మునిగి పోయాడు. తోటి విద్యార్థులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వెలికి తీశారు.