ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో జరగనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు ప్రభుత్వం అనుమతి లభిస్తుందని ఏపీఎన్జీవో హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు
సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో జరగనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు ప్రభుత్వం అనుమతి అభిస్తుందని ఏపీఎన్జీవో హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ ఆదివారం హైదరాబాద్లో ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ వేళ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే కోర్టుకు వెళ్లతామని అన్నారు. గత నెల 13 నుంచి తలపెట్టిన ఉద్యోగుల సమ్మె 90 శాతం వరకు సక్సెస్ అయిందన్నారు. అయితే తాము చేపట్టిన సమ్మెను మానుకోవాలని ఇప్పటివరకు ఎవ్వరు తమను కోరలేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.