శ్రీవారి చెంత శ్రీలంక అధ్యక్షుడు

Srilanka President Visit Tirumala Tirupati Temple - Sakshi

తిరుమల : తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దంపతులు మంగళవారం సందడి చేశారు. మొదట శ్రీవారి పాదాలను దర్శించుకుని, అనంతరం లేపాక్షి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపింగ్‌ చేశారు.

ఘనస్వాగతం
రేణిగుంట: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆయన కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, ఏపీ ప్రోటోకాల్‌ అడిషనల్‌ సెక్రటరీ కల్నల్‌ అశోక్‌కుమార్, తిరుపతి సబ్‌ కలెక్టర్‌ మహేష్‌కుమార్, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ స్వాగతం పలికారు.  అనంతరం వారు రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top