బీసీజీపై వికీపీడియాలో దుష్ప్రచారం

Spoofers Deface Boston Consulting Group on Wikipedia Page - Sakshi

సాక్షి, అమరావతి: వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) వాస్తవ సమాచారం నెటిజన్లకు తెలియకుండా టీడీపీ మద్దతుదారులు వికీపీడియాలో ఆ పేజీని ఎడాపెడా మార్చివేశారు. రెండురోజుల్లోనే 12 సార్లు అందులోని సమాచారాన్ని మార్చి అది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల కంపెనీ అని, బఫూన్‌ కన్సల్టెన్సీ అని తప్పుడు సమాచారాన్ని జోడించారు. బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు వికీపీడియా పేజీని చూడగా ఈలోపే దాన్ని ఇష్టానుసారం మార్చి ఆ సంస్థపై దుష్ప్రచారానికి పూనుకున్నారు. బీసీజీ సమాచారాన్ని పూర్తిగా మార్చివేయడంతో ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వికీపీడియా యాజమాన్యం తప్పుడు సమాచారాన్ని సరిచేసింది. (చదవండి: ముగ్గురి నోట అదే మాట!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top