రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాల్లో ఆందోళనల సందర్భంగా పని ఒత్తిడి ఎదుర్కొన్న పోలీసు సిబ్బందికి ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నేతలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాల్లో ఆందోళనల సందర్భంగా పని ఒత్తిడి ఎదుర్కొన్న పోలీసు సిబ్బందికి ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నేతలు తెలిపారు. ఈ డిమాండ్‌పై శనివారం సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించగా తగిన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా, ప్రతి కానిస్టేబుల్‌కూ ఇంటి స్థలం, బస్‌పాస్ ఇవ్వాలని కూడా సీఎంను కోరామన్నారు. సీఎంను కలిసిన వారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి, గౌరవాధ్యక్షుడు రాధాకృష్ణ, గౌరవ సలహాదారు జి.ఎస్. రాజు, సీనియర్ ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.