ఐపీఎల్‌లోను ప్రత్యేక హోదా నినాదం | Special Category Status Demand At IPL Match By YSRCP | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లోను ప్రత్యేక హోదా నినాదం

Apr 15 2018 10:48 PM | Updated on Jul 24 2018 1:12 PM

Special Category Status Demand At IPL Match By YSRCP - Sakshi

సాక్షి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నినాదం ఇప్పుడు ఐపీఎల్‌ను కూడా తాకింది. ఆదివారం బెంగళూరు వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కొంతమంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ ఫ్లేక్సీలను ప్రదర్శించారు. బెంగళూరు వేదికగా అందులోను అత్యంత ప్రజాదారణ కలిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా హోదా నినాదం వినిపించడం ప్రత్యేకతను సంతరించుకుంది. అవిశ్వాస తీర్మానం, ఎంపీల రాజీనామా, ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement