వెంటవెంట సమస్యలు పరిష్కరించండి | Solve problems continuously | Sakshi
Sakshi News home page

వెంటవెంట సమస్యలు పరిష్కరించండి

Published Tue, Dec 31 2013 5:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టిసారించాలని, వెంటవెంట వాటి పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు.

=ప్రజావాణి ఫిర్యాదులు    పెండింగ్ ఉండొద్దు
=శాఖల వారీగా త్వరగా స్పందించాలి

     
 కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టిసారించాలని, వెంటవెంట వాటి పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. సోమవారం ప్రజావాణిలో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు.ఎంతో నమ్మకంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రజావాణిపై నమ్మకంతో వస్తున్న ఫిర్యాదుదారులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఏ శాఖ లో కూడా ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దన్నారు.
 
 టోల్‌ఫ్రీ ద్వారా వచ్చే, ఇతర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో 232 ఫిర్యాదులు అందా యి. కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ హర్షవర్ధన్ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యార్థుల ఉపకార వేతనా ల విషయంలో ఆధార్ అనుసంధానం రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు  కలెక్టర్‌ను కలిసి కోరారు. గాంధారి మండలంలో ఇంత వరకు ప్రభుత్వ పరంగా మొక్కజొన్న కొనుగోలు చేయలేదని రైతులు  కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉన్న 500 గజాల భూమి ని ఒడ్డెర లు ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలని మంచిప్ప గ్రామస్తులు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో పాఠశాల కాని అంగన్‌వాడీ భవనాన్ని నిర్మిం చాలని  కోరారు. జిల్లాకేంద్రంలోని నిజాంకాలనీలో ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మానానికి నిధులు మంజూరు చేయాలని పాఠశాల విద్యా కమిటీ సభ్యు లు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.
 
 లక్ష్యాలు ఛేదించండి..


 పశు సంవర్ధక శాఖలో నిర్ధారించిన లక్ష్యాలను సాధిం చడం సంబంధిత అధికారుల బాధ్యతని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. సోమవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో పశు సంవర్ధకశాఖ అధికారులతో పశుక్రాంతి ,గొర్రెల పెంపకం యూనిట్స్ , ఇతర పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పథకాల లక్ష్యాల సాధన కోసం బ్యాంకర్లు కాన్‌షెంట్ ఇవ్వలేదని అధికారులు తమ బాధ్యత విస్మరించడం సరికాదన్నారు. బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చి యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేయాలన్నారు. వచ్చేనెల మొదటి వారంలో మండలాల వారీగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి పథకాల లక్ష్యాల సాధన కోసం కాన్‌షెంట్ ఇచ్చే విధంగా  కృషిచేస్తామన్నారు. పశు సంవర్ధకశాఖ అధికారులు బ్యాంకర్ల సమావేశానికి హాజరై అయా బ్రాంచి మేనేజర్లతో కాన్‌షెంట్ ఇవ్వడానికి కృషిచేయాలన్నారు. సమావేశంలో పశు సంవర్ధకశాఖ జేడీ ఎల్లన్న, అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement