పీక్కుతిన్న నిర్లక్ష్యం !

పీక్కుతిన్న  నిర్లక్ష్యం ! - Sakshi


♦ పెద్దాసుపత్రిలో ఎలుకలు కొరుక్కుతినడంతో పసికందు మృతి

♦  నాలుగురోజుల వ్యవధిలో రెండు సార్లు దాడి చేసిన ఎలుకలు

♦ గతంలో రోగులను గాయపరిచిన సంఘటనలు అనేకం

♦ ఏ మాత్రం స్పందించని జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది

♦ మూషికాల నియంత్రణలో ఆస్పత్రి అధికారుల తాత్సారం

 

 గుంటూరు మెడికల్ : ఎలుకల దాడిలో ఓ పసికందు మృతి చెందిన ఘటనతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. గతంలో ఎలుకలు దాడిచేసి రోగులను గాయపరిచిన సంఘటనలు ఉన్నాయి. అయినా ఆస్పత్రిలో ఎలుకల నియంత్రణపై అధికారులు స్పందించకపోవడంతో తాజాగా, పుట్టి పదిరోజులు కూడా నిండని ఓ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన దారుణమైన సంఘటన అందరినీ కలచివేసింది.



 వివరాల్లోకి వెళితే... విజయవాడ కృష్ణలంక పోస్టాఫీస్ బజారుకు చెందిన చావలి లక్ష్మి అనే మహిళ ఈనెల 17న అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో    మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టకతో వచ్చే లోపాల్లో భాగంగా మూత్రసంచి, మూత్రనాళం బయటే ఉండటంతో చికిత్స కోసం పసికందును గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఇక్కడి వైద్యులు పసికందుకు 20న ఆపరేషన్ చేసిన అనంతరం చిన్నపిల్లల శస్త్రచికిత్సా విభాగంలో వెంటిలేటర్‌పై ఉంచారు.



 ఆ విభాగంలో యథేచ్ఛగా తిరుగాడే ఎలుకలు ఈ నెల 23న చిన్నారి ఎడమచేతి ఐదు వేళ్లు, కుడిచే తి రెండు వేళ్లను కొరికి గాయపరిచాయి. దీనిపై వై ద్యులు,వైద్య సిబ్బంది ఏ మాత్రం స్పందించలేదు. పసికందును అలానే ఉంచారు. రెండోసారి బుధవా రం ఎలుకలు పసికందుపై దాడిచేయగా, తీవ్ర గా యాలై రక్తం కారిపోతున్నా తమదే మీ తప్పులేదన్నట్లుగా ఆస్పత్రిసిబ్బంది వ్యహరించడంతో మృత్యు వాతపడ్డాడు.  వార్డులోకి ఎలుకలు వచ్చి పీక్కుతిం టున్నా పట్టించుకోకుండా వ్యవహరించిన వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంవల్లే పదిరోజుల పసికందు ప్రాణాలు గాల్లో కలిసినట్టు స్పష్టమవుతోంది.



 ఆ పసికందుల బాధ్యత వారిదే..

 వెంటిలేటర్, ఫొటోథెరపీ యూనిట్‌లలో ఉంచే పసికందుల సంరక్షణ బాధ్యత వైద్యులు, వైద్య సిబ్బంది చూ డాల్సి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్న దృష్ట్యా అత్యవసర పరిస్థితి నుంచి కోలుకుని సాధారణ స్థితికి చేరుకున్న పిదప మాత్రమే తల్లిదండ్రులను పిల్లల వద్దకు అనుమతిస్తారు. అయితే పసికందు వద్ద  వైద్య సిబ్బంది లే కపోవడం వల్లే ఎలుకలు దా డి చేసినట్టు తెలుస్తోంది. దీ నినిబట్టి వైద్యులు, వైద్య సి బ్బంది నిర్లక్ష్యం పూర్తిస్థాయి లో ఉందనే విషయం చెప్పకుండానే అర్థమవుతుంది.



 తీరు మారని ఆస్పత్రి అధికారులు

 దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన బుంగా పూర్ణమ్మ జ్వరంతో కాళ్లు పట్టేసి నడవలేని స్థితిలో 2013 జనవరి 31న చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర  ఆస్పత్రిలో చేరారు. మార్చి 11న కదలలేని స్థితిలో మంచంపై ఉన్న పూర్ణమ్మ కాళ్లను రెండు రోజులపాటు ఎలుకలు కొరికివేశాయి. ఈ సంఘటన సమయంలో ఎలుకల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు మాటలకే పరిమితమయ్యారు. లక్షల విలువచేసే వైద్య పరికరాలకు అమర్చే విద్యుత్, ఇతర వైర్లను ఎలుకలు తరచూ నాశనం చేసిన సందర్భాల్లో  వైద్యసేవలను సైతం నిలిపివేసిన సంఘటలను ఉన్నాయి. ఆస్పత్రి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎలుకల  నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలి.

 

 శిశువు మృతిపై కేసు నమోదు

 గుంటూరు ఈస్ట్: జీజీహెచ్‌లో ఎలుకలు కొరికిన కారణంగా శిశువు మృతిచెందిన వైనంపై గుంటూరు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్‌ఓ డి.వెంకన్నచౌదరి తెలిపిన వివరాల ప్రకారం 331వ వార్డులో ఎలుకలు కొరికిన కారణంగా శిశువు మృతిచెందిందని, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ శిశువు తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే, ఈ ఘటనను హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించినట్టు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top