నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్వేతా తియోతియాను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఓఎస్‌డీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్వేతా తియోతియాను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఓఎస్‌డీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ అధికారి గైర్హాజరు కాలం క్రమబద్ధీకరణ..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) మహంతి కార్యాలయంలో ‘రాష్ట్ర విభజన’ సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావు.. ఉద్యోగానికి గైర్హాజరైన కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 01-08-2007 నుంచి 18-06-2013 వరకు గైర్హాజరైన కాలాన్ని ఆర్జిత, వేతన, అసాధారణ సెలవుగా క్రమబద్ధీకరిస్తూ బుధవారం సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.