కళాశాల బస్సుకు షార్ట్‌ సర్క్యూట్‌

Short Circuit in College Bus East Godavari - Sakshi

తప్పిన పెను ప్రమాదం

బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు సురక్షితం

తూర్పుగోదావరి, మారేడుమిల్లి:  ఓ కళాశాల బస్సు ఇంజిన్‌లో షార్టుసర్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి, బస్సులో పొగలు వ్యాపించాయి. డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. రాజానగర మండలం తూర్పు గోనగూడెం ఐఎస్‌టీఎస్‌ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం కళాశాల బస్సులో రాజానగరం నుంచి విశాఖ జిల్లా సీలేర్‌కు టూర్‌కు వెళుతుండగా మారేడుమిల్లి వచ్చే సరికి బస్సు ఇంజిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగి బస్సులో పొగలు వ్యాపించాయి.

స్థానిక వినాయక గుడి వద్దకు వచ్చే సరికి బస్సు అంతా పొగ వ్యాపించడంతో డ్రైవర్‌ తక్షణమే బస్సును నిలిపివేశాడు. భయందోళనకు గురైన విద్యార్థులు వెంటనే బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సులో సుమారు 55 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. పొంగ కారణంగా ఇంజినీరింగ్‌ ఫస్టియర్‌ చెందిన సింధూ అనే విద్యార్థి స్పృహ కోల్పోయింది. సమీపంలో పోలీస్‌ స్టేషన్‌ ఉండడంతో ప్రమాదాన్ని గుర్తించిన గుర్తేడు ఎస్సై నాగేశ్వరరావు సీఆర్పీఎఫ్‌ సిబ్బందితో కలిసి బస్సులో మంటలు అదుపుజేశారు. స్పృహ కోల్పోయిన విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top