సీనియర్ సిటిజన్లు జాతికి సంపద | Senior Citizens are wealth for nation | Sakshi
Sakshi News home page

సీనియర్ సిటిజన్లు జాతికి సంపద

Sep 9 2013 4:18 AM | Updated on Sep 4 2018 5:07 PM

సీనియర్ సిటిజన్లు జాతికి సంపద - Sakshi

సీనియర్ సిటిజన్లు జాతికి సంపద

సీనియర్ సిటిజన్స్ మానవ జాతికే ఎనలేని సంపద అని, వారిని ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీనియర్ సిటిజన్స్ మానవ జాతికే ఎనలేని సంపద అని, వారిని ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. సర్వోదయ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని హస్తినాపురం సెంట్రల్ కాలనీ మేజర్ పద్మపాణి ఆచార్య మెమోరియల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సలహాలు, సూచనలు పాటించాలన్నారు. సీనియర్ సిటిజన్స్ అనుభవాలు ఎంతో అమూల్యమైనవని, వారిని ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుందన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement