'తెలంగాణ నోట్ వస్తే ఎంపీలు రాజీనామా చేయాల్సిందే' | 'Seemandhra MPs should resign, says APNGOs president Ashok Babu | Sakshi
Sakshi News home page

'తెలంగాణ నోట్ వస్తే ఎంపీలు రాజీనామా చేయాల్సిందే'

Sep 20 2013 11:47 AM | Updated on Sep 1 2017 10:53 PM

'తెలంగాణ నోట్ వస్తే ఎంపీలు రాజీనామా చేయాల్సిందే'

'తెలంగాణ నోట్ వస్తే ఎంపీలు రాజీనామా చేయాల్సిందే'

తెలంగాణపై కేబినెట్ నోట్ వస్తే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందేనని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు డిమాండ్ చేశారు.

తెలంగాణపై కేబినెట్ నోట్ వస్తే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందేనని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కేబినేట్ నోట్ వస్తే కొంత మంది ఎంపీలు మాత్రమే రాజీనామా చేస్తామంటున్నారు, మిగిలిన ఎంపీలు, కేంద్రమంత్రుల నిర్ణయం ఏమిటి అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు అశోక్బాబుపై విధంగా స్పందించారు. ఇప్పటికీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీ నామాలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన తెలిపారు.


జులై 30న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమానికి సహకరిస్తున్న ప్రజలకు ఆ సందర్భంగా అశోక్బాబు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించాలని తెలంగాణ ఎమ్మెల్యేలను కోరతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement