ఆర్టికల్ 371-డిపై సీమాంధ్ర ప్రాంత నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ నేత వినోద్ అన్నారు.
హైదరాబాద్ : ఆర్టికల్ 371-డిపై సీమాంధ్ర ప్రాంత నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ నేత వినోద్ అన్నారు. 371-డి ఉన్నందున రాష్ట్ర విభజన సాధ్యం కాదన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు.రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర విభజన చేయవచ్చని వినోద్ అన్నారు. గతంలో పంజాబ్-హర్యానా విడిపోయినప్పుడు కూడా 371 రాజ్యాంగ సవరణ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 371-డిపై తోచిన విధంగా మాట్లాడుతున్నారని వినోద్ విమర్శించారు.
మరోవైపు నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం చేసిన రాజ్యాంగ సవరణ దరిమిలా తెరమీదకు వచ్చిన 371డి అధికరణ విభజన నేపథ్యంలో గుదిబండగా మారనుందా? చర్చనీయాంశంగా మారిన పలు సందేహాలకు అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్కు చెందిన ఒక న్యాయవాది కోర్టులో పిల్ వేసిన పిల్ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన ఈ అంశానికి సంబంధించి కేంద్రంలో గుబులు మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజనకు 1973లో సవరించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ‘డి’అధిక రణ కీలకంగా మారనుందనే ప్రచారానికి బలం చేకూరుతోంది.