సీమ అభివృద్ధికి చంద్రబాబే అడ్డు
సీమ అభివృద్ధిపై దృష్టి కేంద్రికరించకుండా సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తున్నారని రాయలసీ మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి....
బస్సు యాత్రలో బెరైడ్డి
సీమలో అపార ఖనిజ సంపద
ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన
ఆదోని విద్య : సీమ అభివృద్ధిపై దృష్టి కేంద్రికరించకుండా సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తున్నారని రాయలసీ మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బస్సు యాత్రలో భాగంగా శనివారం ఆయన ఆదోనిలో జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన ఉక్కు కర్మాగార ఫలాలు కోస్తాం ధ్ర వారు అనుభవిస్తున్నారన్నారు. సీమకు సంబంధించి కడప జిల్లాలో తలపెట్టిన బ్రాహ్మణీ స్టీలుపై నాడు రాజకీయాలు చేసి మన ప్రాంతం వారికి వచ్చే లక్ష ఉద్యోగాలకు గండికొట్టారని ఆరోపించారు.
సీమ గర్భంలో విలువైన ఖనిజ సంపద..
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత విలువైన ఖనిజ సంపద రాయలసీమ భూగర్భంలో నిక్షిప్తమై ఉందని బెరైడ్డి తెలిపారు. ఇటివలే పూల్లోరియన్ ఖనిజాన్ని కడపలో గుర్తించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే సీమప్రాంతంలో జరిగే చిన్న చిన్న తప్పిదాలను భూతద్దంలో చూపించి పెట్టుబడులు రాకుం డా సీఎం చంద్రబాబే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సీమ అభివృద్ధి కోసం 1950లో సర్‌మెటన్జీ చేసిన రాయలసీమ నదుల అనుసంధాన ప్రతిపాదనను బహిర్గతం చేయాలని డిమాండు చేశారు. తెలంగాణ కోసం బాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆంధ్రాలో అవలంబించడంతో సీమ అభివృద్ధి కుంటుపడిందన్నారు. టీడీపీని వీడిన తర్వాత చ ంద్రబాబు తిరిగి తనను పార్టీలోకి ఆహ్వానించారని, అ సమయంలో సీమ అభివృద్ధిపై అడిగితే ఈ ప్రాంతం వారు ఓట్లు వేయలేద ని సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియో టేపులు కూడా తన వద్ద ఉన్నాయని బెరైడ్డి పేర్కొన్నారు.


