ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మరోసారి జర్నలిస్టులపై దాడి జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మరోసారి జర్నలిస్టులపై దాడి జరిగింది. తమకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు జర్నలిస్టుల మీద దాడికి తెగబడ్డారు.
దీనిపై ఈ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులంతా ఆందోళన చేస్తుండగా.. మరోసారి తెలుగుదేశం శ్రేణులు వాళ్ల మీద దాడికి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.