tullur
-
ఇసుక స్టాక్ యార్డులో.. తుళ్లూరు సీఐ వీరంగం
గుంటూరు టాస్‌్కఫోర్స్: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం ఇసుక స్టాక్ యార్డులో తుళ్లూరు సీఐ ఆగడాలు మితిమీరుతున్నాయని, అకారణంగా, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీరంగం వేస్తున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నోటితో చెప్పలేని రీతిలో బండ బూతులు తిడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా.. శనివారం సాయంత్రం ఇసుక లోడింగ్ చేసుకుంటుండగా ఆ సీఐ వచ్చి.. రికార్డులు పరిశీలించి లోడింగ్ జరుగుతున్న ట్రాక్టర్ డ్రైవర్‌ను కిందకు దించి ‘నీకిది మూడో ట్రిప్పు.. నువ్వెందుకు వచ్చావురా? నీ ఊరేది, నీ కులం ఏంటి రా..?’ అని గద్దించారు. డ్రైవర్ ఉద్దండరాయునిపాలెం అని బదులివ్వగానే.. మా.. లం..కో..ల్లారా.. అంటూ అతన్ని బిల్లులు రాసే దగ్గరకి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి బూతులు తిడుతూ ఇష్టమొచ్చినట్లు కొట్టి వే బిల్లును లాక్కొని ట్రాక్టర్‌ను వే బ్రిడ్జి దగ్గర కాటా పెట్టించి స్టేషన్‌కు తీసుకురావాలని కానిస్టేబుల్‌కు చెప్పారు. నిజానికి.. లోకల్ ట్రాక్టర్ కావడం, ట్రాక్టర్లు తక్కువ సంఖ్యలో ఉండటంతోపాటు స్థానిక గ్రామాల్లోనే ఇసుకను తోలుతుండటంవల్ల సదరు ట్రాక్టర్ ఆ రోజు క్యూలోనే మూడో ట్రిప్పు కింద వచ్చింది. అయితే, అసలు వే బిల్లులు ఇచ్చిన వారిని వదిలిపెట్టి తనను కావాలనే టార్గెట్ చేసి కులం పేరుతో దూషించి కొట్టాడని బాధితుడు ప్రసన్నకుమార్ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వానికి నిర్ణీత ధర చెల్లించి వే బిల్లులు తీసుకుని ఇసుకను తీసుకెళ్తున్న దళితుడినైన తనపై సీఐ దుర్మార్గంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించాడు. స్టాక్ యార్డులో వేబ్రిడ్జి ఉండాల్సి ఉన్నప్పటికీ అవేమీ నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా కేవలం జేసీబీ బొచ్చ ప్రామాణికంగా లోడింగ్ జరుగుతుంటే వాహనాలపై అధిక లోడు కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరో యువకుడిపైనా మాటల దాడి.. ఇక ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ అనే మరో ఎస్సీ యువకుడి లారీపై కూడా ఓవర్ లోడింగ్ కేసు నమోదు చేసిన సీఐ అతన్ని కూడా పిలిపించి.. రాయడానికి వీల్లేని భాష మాట్లాడుతూ.. ‘మా.. నా కొ.. నీ మీద తొమ్మిది కేసులున్నాయి.. ఇంకోసారి కనపడితే నీ మీద రౌడీïÙట్ ఓపెన్ చేసి బొక్కలో వేస్తా నువ్వు ఊరు వదిలి పారిపోవాలి’.. అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని బాధితుడు వాపోయాడు. ఇలా ఉద్దండరాయునిపాలెం ఎస్సీ యువకులే టార్గెట్‌గా సీఐ బెదిరింపులు ఎక్కువయ్యాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. పడిగాపులు కాసి ఒక్క ఇసుక ట్రాక్టరు తీసుకెళ్లి అన్లోడ్ చేస్తే యజమాని వద్ద నుంచి మాకు వచ్చేది రూ.300–రూ.400లేనని.. పోలీసులు ఇలా తమను టార్గెట్ చేస్తే బతికేదెలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. ఇసుక తరలింపులో టీడీపీ నేతల వాహనాలను వదిలేసి వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలే టార్గెట్‌గా సీఐ వ్యవహరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అదే టీడీపీకి చెందిన వారి వాహనాలు కూడా ఎక్కువ ట్రిప్పులు వేసినట్లు రికార్డుల్లో ఉన్నా తమనే టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కులం పేరుతో తిట్టి కాళ్లతో తన్నాడు.. బిల్లు రాయించుకుని లోడింగ్ చేసుకునేందుకు వెళ్లిన నన్ను పిలిచి మాదిగ లం..కొ..ల్లారా అంటూ జుట్టు పట్టుకుని (రాయలేని భాషలో తిడుతూ) చెంపల మీద కొట్టి కిందపడేసి బూట్లతో కడుపులో గట్టిగా తన్ని ‘నా కొ.. ఉద్దండరాయునిపాలెం మా.. నా కొ.. ఊళ్లో ఒక్కడినీ ఉండనివ్వను’ అంటూ నానా మాటలన్నాడు. – ప్రసన్నకుమార్, ట్రాక్టర్ డ్రైవర్ రౌడ్‌షీట్ ఓపెన్ చేసి బొక్కలో.. నాపై గతంలో టీడీపీ వాళ్లు పెట్టిన కేసు విషయంలో స్టేషన్‌కు పిలిపించి ఏ కులం అని అడిగి.. ‘మా.. నా కొ.. మీకు ఎక్కడవిరా ఈ లారీలు? నీ మీద 9 కేసులున్నాయి. ఇంకోసారి కనబడితే ‘నా కొ.. నీ మీద రౌడీïÙట్ ఓపెన్ చేస్తానంటూ చెప్పలేని మాటలతో దూషించాడు. – నందిగం మణికంఠ -
చంద్రబాబు రూటు మార్పు అందుకోసమే: సుచరిత
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నక్క జిత్తులను ప్రయోగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలన్నది ఆయన ప్లాన్ అని మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి సుచరిత గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తుళ్లూరులో నేటి చంద్రబాబు సభకు పోలీసులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్ రూట్‌ను కూడా పోలీసులకు ఇచ్చారని, ఆ రూట్లో పోలీసులు అన్ని రకాలుగా నిన్ననే భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్ ఇప్పుడు ఆకస్మికంగా చంద్రబాబు తన రూట్‌ను మార్చుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు మద్దుతుగా కార్యక్రమాలు చేస్తున్న వారి వైపుగా తాను వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీని ద్వారా ఘర్షణలు జరగాలని, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించాలనేది చంద్రబాబు ఉద్దేశమని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండకూడదని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలను అందరూ ఖండించాలని సూచించారు. చంద్రబాబు ముందు తన విషపు ఆలోచనలను విడిచిపెట్టాలని, శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కోరారు. చదవండి: పండగ వాతావరణంలా బీసీ సంక్రాంతి సభ -
తుళ్లూరులో ప్లాట్ల పంపిణీ రసాభాస
* సవరణలు పూర్తయ్యాక లాటరీ తీయాలని రైతుల డిమాండ్ * వారి మొర ఆలకించని అధికారులు * సభ నుంచి వెళ్లిపోయిన బోరుపాలెం రైతులు తుళ్లూరు: స్థానిక సీఆర్డీఏ కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన ప్లాట్ల పంపిణీ రసాభాసగా మారింది. మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైనకార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, కమిషనర్ శ్రీధర్, ఐటీ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాకే ప్లాట్లు పంపిణీ చేయాలని రైతులు మొర పెట్టుకున్నారు. అధికారులు వినకపోవడంతో రైతులు వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు మీకు ఇష్టమొచ్చినట్లు ఇచ్చే ప్లాట్లు మాకొద్దని నిరసన తెలిపారు. అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు స¿¶ æనుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కొండమరాజు పాలేనికి చెందిన రైతులు జరీబు కింద పొలాలు తీసుకుని నేలపాడు సమీపంలోని గుంటల్లో ప్లాట్లు ఇస్తున్నారని ఏకరవు పెట్టారు. ఇప్పుడే ఇలా వేధిస్తుంటే అన్నీ మీ చేతుల్లోకి వచ్చాక మా బతుకులు ఏమి కావాలంటూ మండిపడ్డారు. అధికారులు మాత్రం కొండమరాజుపాలెం గ్రామానికి చెందిన 568 మంది రైతులకు 763 ఎకరాలకుగాను 494 రెసిడెన్షియల్, 497 కమర్షియల్, బోరుపాలేనికి సంబంధించి 346 మంది రైతుల నుంచి 349 ఎకరాలకు 494 నివాస, 497 కమర్షియల్ ప్లాట్లు కేటాయించారు. -
అక్రమమైనా సక్రమం చేసేస్తాం!
అనుంగు పెద్దలకు సీఎం ఆత్మీయ నజరానా! ఆక్రమణ భవనం ఇచ్చినందుకు 22 భవనాలకు లైన్‌క్లియర్ కృష్ణా కరకట్ట ఎలైన్మెంట్ మార్పుతో అక్రమాలు సక్రమం చేసే ఎత్తుగడ ముసాయిదాలో లేని ఎగ్జిస్టింగ్ రెసిడెంట్స్.. తుది మాస్టర్‌ప్లాన్‌లో ప్రత్యక్షం సీఎం చంద్రబాబు తొత్తుల కోసం పేదలకు అన్యాయం సాక్షి, విజయవాడ బ్యూరో: తమ్ముళ్లూ నిప్పులా బతికాను.. నిజాయితీగా నిలిచాను అంటూ డైలాగులు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నది అడ్డగోలుగా చేస్తారనేందుకు కృష్ణా కరకట్ట ఆక్రమణల వ్యవహారమే తాజా ఉదాహరణ. నిబంధనలకు నీళ్లొదిలి, చట్టాలను పునాదుల్లో తొక్కేసి నిర్మించిన అక్రమ భవనాలకు దొడ్డిదోవన రాజముద్ర వేశారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక పలుకుబడి కలిగిన పెద్దలు కృష్ణమ్మను కబ్జా చేసి కరకట్ట దిగువన నిర్మించుకున్న విలాసవంతమైన సౌధాలు ఇప్పుడు సక్రమమని తేల్చేశారు. ఇందుకు సానుకూల పరిస్థితిని కల్పించేలా కృష్ణా కరకట్ట ఎలైన్మెంట్ మార్పు, తుది మాస్టర్‌ప్లాన్‌లో ఆర్-1జోన్‌గా చూపించి తన అనుంగు పెద్దలకు ప్రేమతో ముఖ్యమంత్రి నజరానాగా ఇచ్చారు. దారికి తెచ్చుకున్నది ఇలా.. కరకట్ట దిగువన ఆక్రమించి, పక్కా భవనాలు నిర్మించకూడదన్న నిబంధనలను ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇవ్వాలంటూ గతంలో మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక తమ దారికి తెచ్చుకునేందుకేనని తేటతెల్లమవుతోంది. వీటికి సంబంధించి అప్పట్లో ఆయన అధికారులను కోరి రప్పించుకున్న నివేదిక బుట్టదాఖలైంది. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో 22 ప్రధాన కట్టడాలుండగా వాటిలో మూడు మినహా మిగిలినవన్నీ అక్రమమేనని తాడేపల్లి తహసీల్దార్ లెక్క తేల్చారు. ప్రస్తుతం సీఎం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ కూడా అక్రమమేనని రెవెన్యూ అధికారులు గతంలో నోటీసులిచ్చేందుకు సిద్ధమయ్యారు. మంత్రులు నారాయణ, పుల్లారావులు పూలింగ్‌లో స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు కూడా. తాజా పరిణామాలతో మంత్రులు, అధికారుల ప్రకటనలన్నీ నీటి మూటలేనని ముఖ్యమంత్రి తేల్చేశారు. అక్రమాలు సక్రమం చేసే క్లైమాక్స్ ఇది.. సీఎం నివాసంగా మలుచుకోవడం దగ్గర్నుంచి కరకట్ట ఆక్రమణలను సక్రమం చేసుకొనే దాకా ప్రభుత్వ యంత్రాంగం నడిపిన తంతు అంతా ఇంతా కాదు. నేరుగా సీఎం ఆక్రమణ భవనాన్ని నివాసంగా మలుచుకోగా ఆయన తనయుడు లోకేశ్ అక్కడికి సమీపంలోని మరో అక్రమ భవనాన్ని విడిదిగా చేసుకున్నారు. అనుమతిలేని కట్టడానికి మెరుగులు దిద్దేందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుపెట్డడానికి నిబంధనలు అడ్డుకావడంతో ఆ భవనాన్ని క్రమబద్ధీకరించుకున్నారు. సీఎంకు నివాసయోగ్యంగా మలిచేందుకు ఆ భవనానికి దాదాపు రూ.7 కోట్లకుపైగా ఖర్చుపెట్టారు. కరకట్ట రోడ్డు, సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, హెలీప్యాడ్, ప్రహరీగోడ, సిబ్బంది క్వార్టర్ల కోసం దాదాపు రూ.60 కోట్లకుపైగా వెచ్చించారు. సీఎం నివాసం వద్ద ఇంకా పలు నిర్మాణం పనులు సాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం నివాసం కోసం ఆ భవనాన్ని రెగ్యులరైజ్ చేస్తే అదే కరకట్ట దిగువన ఉన్న అనధికార కట్టడాలను క్రమబద్ధీకరించుకునేలా పెద్దలు చేసిన తెరవెనుక ప్రయత్నాలు ఫలించాయి. దీంతో సీఎం నివాసం, పెద్దల ఆక్రమిత భవనాలు కరకట్ట దిగువన ఉండటంతో వాటిని మినహాయించి కృష్ణా నదికి ఆనుకుని కొత్త కరకట్ట నిర్మించేలా ఎలైన్మెంట్ మార్పు చేశారు. కరకట్ట లోపలి ఆక్రమిత భవనాలు అన్నీ బయటకు వచ్చి గ్రామ విస్తీర్ణంగా పరిగణిస్తే రివర్ కన్జర్వెన్సీ యాక్ట్, నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. మరోవైపు మాస్టర్‌ప్లాన్ ముసాయిదాలో కృష్ణా కరకట్ట ఆక్రమణలను ప్రస్తావించని ప్రభుత్వం తుది మాస్టర్‌ప్లాన్‌లో ఆ ప్రాంతాన్ని ఆర్-1(ఎగ్జిస్టింగ్ రెసిడెంట్స్)గా పేర్కొనడంతో అవి సక్రమమేనని ప్రభుత్వం దొడ్డిదోవన గుర్తింపు ఇచ్చినట్టు అయ్యింది. ఇంత పక్షపాతమా.. పెద్దల విలాస భవనాలకు మినహాయింపు ఇచ్చిన సర్కారు పేదల ఇళ్లకు మినహాయింపు ఇవ్వకుండా పక్షపాతం చూపించడం విమర్శలకు తావిస్తోంది. తుది మాస్టర్‌ప్లాన్‌లో పెద్దల భవంతులను నివాసప్రాంతంగా మార్కు చేసిన ప్రభుత్వం దాదాపు 400లకు పైగా పేదల ఇళ్లను గుర్తించలేదు. రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయిపాలెంలో కృష్ణా కరకట్ట దిగువన ఉన్న పేదలు ఇళ్లను నివాసప్రాంతంగా గూర్తిస్తూ ఆర్-1లో మార్క్ చేయకపోవడంతో వాటిని తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పింది. -
రోడ్డు పడితేనే రాజధాని నిర్మాణం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ప్రధాన రోడ్లను నిర్మిస్తేనే సీడ్ కేపిటల్లో నగర నిర్మాణ పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సీఆర్డీఏ ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అక్టోబరు 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగానే మాస్టర్ డెవలపర్ ఎంపిక పూర్తవుతుంది. పనులు మొదలయ్యాక భారీ యంత్రాలు, వాహనాల రాకపోకలు పెరుగుతాయి. చెన్నై, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి భారీ నిర్మాణ సామాగ్రి వస్తుంది. మంగళగిరి వై జంక్షన్ దగ్గర భారీ మెటీరియల్ స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సీడ్ కేపిటల్ వరకూ చిన్నచిన్న వాహనాల్లో వీటిని తరలించాలని యోచిస్తోంది. ఇందుకోసం నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఆర్డీఏ అధికారులు మూడ్రోజుల క్రితం కన్సెల్టెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదో నంబరు జాతీయ రహదారిలో కృష్ణానదిపై నిర్మించిన కనకదుర్గమ్మ వారధి నుంచి ఉండవల్లి మీదగా సీడ్‌కేపిటల్ ప్రాంతం వరకూ 15 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన నాలుగు వరుసల యాక్సెస్రోడ్డు పనులను చేపట్టదల్చుకున్న కన్సెల్టెన్సీ సంస్థలు ఈ నెల 8 లోగా తమ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను అందజేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే మణిపాల్ ఆస్పత్రి ముందున్న కరకట్ట రోడ్డు మీదుగా ఫై్లవోవర్, సీతానగరం రైల్వే లైనుపై రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఇక్కడున్న కొండ చుట్టూ మళ్లీ ఫై్లవోవర్ను కొనసాగించి ప్రకాశం బ్యారేజీ రోడ్డుకు కలుపుతారు. మళ్లీ ఇక్కడి నుంచి నాలుగు వరుసల రోడ్డు మొదలై ఉండవల్లి, పెనుమాక పక్కగా తాళ్లాయిపాలెం వరకూ వెళ్తుంది. కృష్ణా జిల్లా గొల్లపూడి తొమ్మిదో నంబరు జాతీయ రహదారి నుంచి కృష్ణానది మీదగా రాజధాని ముఖద్వారం నుంచి గేట్‌వే పక్కగా వెళ్లే నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో ఈ 15 కి.మీ యాక్సెస్ రోడ్డు కలుస్తుంది. ఐదో నంబరు రహదారి నుంచి మరో ఎక్స్‌ప్రెస్ వే? ఐదో నెంబరు జాతీయ రహదారి నుంచి కూడా మరో ఎక్స్‌ప్రెస్ వేను సీడ్‌కేపిటల్ వరకూ నిర్మించే వీలుంది. సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌లో పొందు పర్చిన ప్రకారం తాడేపల్లికు శివారునున్న కొలనుకొండ- కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వలకు ఉత్తరంగా హైవే నుంచి మొదలయ్యే నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ వే తాడేపల్లి మండల కార్యాలయం పక్కగా ఉండవల్లికి ఉత్తరంగా కొండల వరకూ వెళ్తుంది. ఇక్కడున్న కొండకు సొరంగం వేసి పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం మీదగా తాళ్లాయిపాలెం వరకూ ఈ రోడ్డు నిర్మాణం ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను మాత్రం సీఆర్డీఏ నోటిఫికేషన్లో పొందుపర్చలేదు. సీడ్ కేపిటల్‌కు అనుసంధాన(ఆర్టేరియల్) రహదారులన్నింటినీ ఒకే సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భౌగోళిక అంశాలను పరిశీలిస్తే రాజధాని ప్రాంతం మొత్తం గుంటూరు జిల్లా వైపే అభివృద్ధి చెందే వీలున్నందున రోడ్డు మార్గాలన్నీ ఎక్కువగా ఇటువైపే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాల నుంచి రాజధానికి వచ్చే ప్రధాన రోడ్లన్నింటినీ ఇవి కలుపుకుని సీడ్ కేపిటల్ వరకూ తీసుకెళ్తాయని వీరంటున్నారు. -
రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీ పర్యటన
-
ముగ్గులతో మహిళల నిరసన
నిరసన తెలపడానికి అనేక మార్గాలుంటాయి. కొంత మంది ఉద్యమబాట పడతారు..మరికొంత మంది మౌనప్రదర్శన చేస్తారు.. ఇంకొంతమంది హింసను ఎన్నుకుంటారు. కానీ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు ప్రాంత మహిళలు మాత్రం.. సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో తమ నిరసన తెలిపారు. ముగ్గుల ద్వారా తమ మనసులోని భావాలు చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చేది లేదని పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు తెలిపారు. భూములు ఇవ్వం అంటూ రంగురంగుల ముగ్గులతో రాశారు. స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా, ఏపీ సర్కారు మాత్రం మొండిగా భూసేకరణతోనే ముందుకెళ్తోంది. -
తుళ్లూరులో మళ్లీ జర్నలిస్టులపై దాడి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మరోసారి జర్నలిస్టులపై దాడి జరిగింది. తమకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు జర్నలిస్టుల మీద దాడికి తెగబడ్డారు. దీనిపై ఈ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులంతా ఆందోళన చేస్తుండగా.. మరోసారి తెలుగుదేశం శ్రేణులు వాళ్ల మీద దాడికి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ ఇద్దరు ఎవరు..!
*వారి సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? *పెట్రోలు క్యాన్లతోసహా దొరికినా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? * విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? * హాట్‌టాపిక్‌గా మారిన పొలాల్లో చిచ్చు నిందితుల వ్యవహారం * హైదరాబాద్ స్థాయి ఒత్తిళ్ళవల్లే బయటపెట్టడం లేదనే అనుమానాలు * అసలు దోషుల్ని బయటపెట్టాలంటూ రైతుల రాస్తారోకో గుంటూరు: రాజధాని ప్రాంతంలోని ఆరు గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో కార్చిచ్చు రేపిన దుర్ఘటనలో పెట్రోలు క్యాన్లతో సహా ఇద్దరు నిందితులను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీరిని విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సంఘటనా స్థలాలను పరిశీలించిన ఐజీ పీవీ సునీల్‌కుమార్ పలుమార్లు స్వయంగా వల ముక్కలకు నిప్పంటించి చూశారు. మామూలుగా అంటుకోకపోవడంతో కచ్చితంగా పెట్రోలుపోసి నిప్పంటించి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. దీన్నిబట్టి చూస్తే సోమవారం రాత్రి పోలీసులకు దొరికిన ఆ ఇద్దరే ఈ సంఘటనలకు పాల్పడి ఉంటారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకుని రెండు రోజులు కావస్తున్నా వారు ఎక్కడ ఉన్నారు..? పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి..? అసలు ఆ ఇద్దరి గురించి పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. హైదరాబాద్ స్థాయిలో ఒత్తిళ్లు రావడం వల్లే ఆ ఇద్దరినీ ఎవ్వరి కంటపడకుండా గోప్యంగా ఉంచారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ ఇద్దరు చెప్పిన విషయాలు బయటకు వస్తే రాష్ట్రస్థాయిలో తీవ్ర కలకలం రేగుతుందనే ఉద్దేశంతోనే పోలీసులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటనకు పాల్పడిన తీరును బట్టి చూస్తే ఇది సైకోల పనిలా ఉందంటూ పోలీస్ ఉన్నతాధికారులు కేసును తప్పుదోవ పట్టించేందుకు పథక రచన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిష్పక్షపాతంగా దర్యాప్తుచేసి అసలైన నిందితులను పట్టుకుని ఈ సంఘటన వెనుక ఉన్న అసలైన సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. బాధితులకు మంత్రి నారాయణ పరామర్శ తుళ్లూరు: మండలంలోని లింగాయపాలెం, రాయపూడి, మందడం గ్రామాల్లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా నష్టపోరుున రైతులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం పరామర్శించారు. రైతులకు అండగా ఉంటామని చెప్పారు. పొలాల్లో నిప్పు పెట్టిన ఘటన ఉన్మాద చర్యలా కనిపిస్తోందన్నారు. బాధ్యులెవరో త్వరలో తేలుతుందని చెప్పారు. -
'నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు'
గుంటూరు: జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో విధ్వంస సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలను మంత్రి పర్యటించారు. రాజధాని రావటం ఇష్టం లేనివారే ఇలాంటి కుట్రలు పాల్పడి ఉండవచ్చన్నారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు. -
పంట పొలాల్లో ‘రాజధాని’ మంటలు
* ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల రైతుల పొలాల్లో నిప్పుపెట్టిన దుండగులు * గుంటూరు జిల్లాలో ఘాతుకం * ఆ గ్రామాలన్నీ ‘ఏపీ రాజధాని’కి భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులవే * బాధిత రైతులంతా తమ భూములు ఇవ్వబోమని స్పష్టంగా చెప్తున్న వారే * అరటి తోటల్లో వెదురు బొంగులు, పొలాల్లో పాకలు, వస్తు సామగ్రికి నిప్పు * అన్నదాతల్లో భయాందోళనలు.. ఘటనపై ఏపీ సీఎం చంద్ర బాబు ఆరా * ఘటనల గురించి డీజీపీ ఆరా.. దుశ్చర్యలపై పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు * సంఘటనా స్థలాలను పరిశీలించిన గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు * గ్రామాల్లో పోలీసుల భారీ మోహరింపు.. అదుపులో అనుమానితులు? * ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ సందర్శన * రైతులే తగలబెట్టుకున్నారంటూ మంత్రి, టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు * ఆగ్రహించిన బాధిత రైతులు.. మంత్రి పుల్లారావును అడ్డుకున్న వైనం * రాజధానికి భూములు ఇవ్వబోమన్నందునే ఇలా చేయించారని ధ్వజం * సంఘటనా స్థలాలను సందర్శించిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు * ఘటనలపై దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ * గ్రామాల్లో బాధిత రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామని ప్రకటన సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను తగలబెట్టారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము మధ్య జరిగినట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒకేసారి ఇన్ని చోట్ల దుండగలు నిప్పు పెట్టడంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక పథకం ప్రకారం జరిగినట్లు పోలీసులు సైతం ధ్రువీకరిస్తున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లోనే ఆగంతకులు పొలాల్లో సామగ్రి తగలబెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తవవుతున్నాయి. సంఘటన జరిగిన తీరుచూస్తే పక్కా ప్రణాళికతోనే ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. రోడ్డు వెంబడి ఉన్నవే కాకుండా 1.5 కిలోమీటర్ల లోపల పొలాల మధ్యలోకి వెళ్లీ తగలబెట్టారు. గంట గంట తేడాతో దహనకాండ... ఆదివారం సాయంత్రం నాలుగు 30 గంటలకు లింగాయపాలెంలో వెదురుబొంగులకు నిప్పు పెట్టడంతో దహనకాండ మొదలైందని, గంట గంట తేడాతో ఈ దహనకాండ మందడం, వెంకటాయపాలెం, పెనుమాక, ఉండవల్లిల్లో వరస క్రమంలో సోమవారం తెల్లవారుజాము వరకు 13 చోట్ల సాగినట్లు తెలుస్తోంది. సపోర్ట్‌గా పెట్టే వెదురుబొంగులను తగులబెట్టడంతో అరటి పంట కొంతమేర దెబ్బతింది. పెనుమాకలో రైతుల షెడ్లను తగలబెట్టడంతో డ్రిప్‌తో పాటు ఎరువులు, పురుగు మందులు తగలబడ్డాయి. ప్రధానంగా పెనుమాకలో భవనం శంకరరెడ్డి షెడ్డులో డ్రిప్‌తో పాటు రసాయన ఎరువులు, పొలపు సాంబిరెడ్డికి చెందిన షెడ్డు దానిలో ఎరువులు, కల్లం నరేంద్రరెడ్డికి సంబంధించిన క్వాలిటీ కూరగాయలు తదితరాలను తగలబెట్టారు. ఒక్కో రైతుకు దాదాపు మూడు లక్షల రూపాయల మేరకు నష్టం సంభవించింది. పెనుమాకలో రైతులంతా తాము భూసమీకరణకు వ్యతిరేకంగా ఉండటం వల్లే తగలబెట్టారన్నారు. లింగాయపాలెం, మందడం రైతులు సంఘటన ఎలా జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రెండు జిల్లాల పోలీసుల దర్యాప్తు ఈ దుశ్చర్యలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. డీజీపీ జాస్తి వెంకట రాముడు విజయవాడలోనే ఉండటంతో సంఘటనపై ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఆరా తీస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి స్పష్టమైన ఆదే శాలు ఇవ్వడంతో సోమవారం ఉదయం నుంచి గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు పి.హెచ్.డి.రామకృష్ణ, రాజేష్‌కుమార్‌లు 10 ప్రత్యేక బృందాలతో సంఘటనా స్థలంలో ఉండి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి సైతం అదనపు డీసీపీ జి.రామకోటేశ్వరరావు నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు సబ్ఇన్స్పెక్టర్లు, 30 మంది పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఇంటెలిజెన్స్ అధికారులు, డాగ్ స్క్వాడ్ బృందాలు సోమవారం సాయంత్రం ఘటనా ప్రాంతాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. గుంటూరు అర్బన్ పరిధిలో ఆరు చోట్ల, రూరల్ పరిధిలో ఏడు చోట్ల గుర్తు తెలియని ఆగంతకులు.. అరటి చెట్లకు సపోర్టుగా పెట్టే కర్రలను, డ్రిప్ ఇరిగేషన్ పైపులను దహనం చేశారు. ఈ దుశ్చర్యల్లో ఎక్కువ మంది పాల్గొనలేదని, ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఒక టీమ్‌గా ఏర్పడి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అల్లర్లు సృష్టించటానికా..? ఈ ఘటనలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి ఎవరైనా పథకం ప్రకారం చేశారా? లేదా ఆకతాయిల పనా? లేదా భూములను కొనుగోలు చేస్తున్న వారిని భయాందోళనకు గురి చేసి రియల్ ఎస్టేట్ బూమ్‌ను తగ్గించడానికి ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? తదితర కోణాలపై పోలీసులు దృష్టిసారించారు. సంఘటన జరిగిన గ్రామాల్లో ప్రతి ఏటా లక్ష వెదురు బొంగులను రైతులు కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది అలా కొనకుండా పాత వాటినే వినియోగిస్తున్నారు. దీంతో వ్యాపారలు ఎవరైనా ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాబు దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం... సాక్షి, హైదరాబాద్: ఈ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు, అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాలను రాజధాని పరిధి నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అవి కుట్రతో చేసిన పనులే: డీజీపీ రైతుల పొలాల్లోని వస్తుసామగ్రి దహనం ఘటనల వెనుక కుట్ర దాగి ఉందని డీజీపీ జె.వి.రాముడు అనుమానం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు 10-15 కిలోమీటర్ల పరిధిలో తిరుగుతూ లింగాయపాలెం నుంచి ఈ చర్యలకు ఉపక్రమించినట్లు నిర్థారించామన్నారు. ఇవి వరుసగా జరిగాయని వెలుగులోకి వచ్చాకే బాధిత రైతులు తమకు ఫిర్యాదు చేశారన్నారు. నిందితుల్ని గుర్తించడానికి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసుల అదుపులో ఇద్దరు కీలక నిందితులు! సాక్షి, గుంటూరు: రాజధాని గ్రామాల్లో పొలాలకు నిప్పంటించిన ఘటనలో ఇద్దరు కీలక నిందితులు పోలీసులకు పట్టుబడ్డట్లు తెలిసింది. వారి నుంచి మూడు డీజిల్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో వారు కీలక సమాచారాన్ని వెల్లడించినట్లు తెలిసింది. గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాత్రం దీన్ని ఖండించారు. మంత్రిని ప్రశ్నించిన రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పొలాలకు నిప్పంటించిన ఘటనపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నిలదీసినందుకు కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేసినందుకు పెనుమాకలో ఆయన్ను రైతులు నిలదీశారు. రాజధానికి భూములివ్వబోమంటూ నినాదాలు చేశారు. పొలాలకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో రైతులను పోలీసులు బెదిరించారు. గొడవ చేస్తే రౌడీషీట్లు తెరుస్తామంటూ ఓ సీఐ రైతులను హెచ్చరించారు. రైతుల్లో పలువురిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య అంటూ పలువురు రైతులు మండిపడుతున్నారు. నేడు రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీ బృందం పర్యటన రాజధాని గ్రామాల్లో జరిగిన దహనకాండను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజధాని రైతు పరిరక్షణ సమితి బృందం మంగళవారం ఆ గ్రామాల్లో పర్యటిస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. మాజీ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, కొడాలి నాని, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, తాడికొండ సమన్వయకర్త హెనీ క్రిస్టినా ఆ గ్రామాల్లో పర్యటించి, సంఘటనపై రైతుల నుంచి వివరాలు సేకరిస్తారని తెలిపారు. మంత్రి చులకనగా మాట్లాడారు నేను మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. ఉండవల్లి చినడొంకలో ఒక ఎక రంలో దొండపాదు వేశాను. పక్కనే వ్యవసాయ పనిముట్లు పెట్టుకునేందుకు ఒక పాక కూడా వేశాను. రాత్రి దుండగులు ఆ పాకకు నిప్పంటించారు. పాకలో పవర్‌స్పేర్, డ్రిప్ ఇరిగేషన్ పైపులు, మందు క ట్టలు అన్నీ బూడిదపాలయ్యాయి. మూడు లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది. హైకోర్టు జడ్జి లక్ష్మణరావును కలిసి.. మా పొలాలు రాజధానికి ఇవ్వబోమని చెప్పాను. దీని నిమిత్తం హైకోర్టులో ఫిటిషన్ దాఖాలు చేయమని అడిగాను. ఇవి అన్ని దృష్టిలో పెట్టుకుని తగలబెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తగలబడిన పాకను పరిశీలించడానికి వ చ్చిన సమయంలో తెలుగుదేశం తమ్ముళ్లు ‘మీ పాకలు మీరే తగలబెట్టుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. రైతులంటే టీడీపీ ప్రభుత్వానికి ఎంత చులకనో ఈ వ్యాఖ్యల బట్టే అర్థమవుతుంది. - భవనం శంకరరెడ్డి, పెనుమాక నేను ఏ మీటింగులకూ వెళ్లలేదు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. చేనుకు రావడం ఇంటికి వెళ్ళడం తప్ప ఏ మీటింగులకు వెళ్లలేదు. ఈ మధ్య కాలంలో రైతుల భూములు ప్రభుత్వం లాక్కొంటోంది అనడంతో ఇంటిల్లిపాదీ భయాందోళనకు గురయ్యాం. రాజధానికి వ్యతిరేకంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో సమావేశాలు ఏర్పాటుచేస్తే, అక్కడకు హాజరయ్యాను. మా భూములు మాత్రం మేము ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పాను. నా పక్కనే మరో పాక ఉండగా నా పాక తగలబెట్టడంలో అర్ధమేమిటో ప్రభుత్వమే చెప్పాలి. - పల్లప్రోలు సాంబిరెడ్డి, ఉండవల్లి ఎలా జరిగిందో ఇది ఎటూ తేల్చలేని విషయం. సైకో చేశాడా? లేక రాజధాని విషయంలో జరిగిందా? తెల్చుకోలేక పోతున్నాం. ఏది ఏమైనప్పటికి అంతిమంగా రైతులమే సష్టపోతున్నాం. ఈ విధంగా తగలబెట్టడం దారుణం. నిందితులను పట్టుకుంటే నిజాలు వెల్లడవుతాయి. విద్వేషాలు రెచ్చకొట్టకుండా ప్రశాంత వాతావరణం ఏర్పాటుకు కృషి చేయండి. - పానకాలరెడ్డి, పెనుమాక, సర్పంచ్ తీవ్రంగా నష్టపోయా నేను కౌలు రైతును. అప్పులు చేసి అరటి పంట పండిస్తున్నాను. రాజమండ్రి నుండి వెదురుబొంగులు ను తీసుకొచ్చుకున్నాను. రూ. 2.50 లక్షలకు పైగా బొంగులకే ఖర్చయింది. గుర్తు తెలియని అగంతకులు చేసిన ఈ దుర్ఘటనతో తీవ్రంగా నష్టపోయా. నన్ను ఆదుకునేది ఎవరు? రాజధానికి భూములు ఇవ్వం అన్న నెపంతో నిప్పు రాజేశారో.. లేక ఆగంతుల అల్ల రి చర్యో అర్ధం కావడం లేదు. మాకు ఎవరితో ఎటువంటి కక్ష లు, వివాదాలు లేవు. మమ్మల్ని ప్రభుత్వం అదుకోవాలి. - జొన్నకూటి నాగేశ్వరావు, పెనుమాక -
'మంత్రి ప్రత్తిపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో పంట పొలాల్లో మంటలు చెలరేగిన ఘటనలపై పోలీసులు ఓవైపు విచారిస్తుండగా, మరోవైపు దీని వెనుక తమ పాత్ర, వైఎస్ జగన్ ప్రమేయం ఉందనడం అవివేకమని ధ్వజమెత్తారు. మంత్రి క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను భయభ్రాంతులకు గురి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు.