వీళ్లు ఏం పాపం చేశారు..

School childrens faced road problem in Visakhapatnam - Sakshi

సాక్షి, తగరపువలస: నేటి బాలలే రేపటి బావిభారత పౌరులని చెబుతుంటారు. కానీ అలాంటి బాలలకు ఎంత కష్టం వచ్చిందో చూడండి. పాఠశాలకు పోవాలంటే కుప్పుల మధ్య వెళ్లాల్సిన పరిస్థితి. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇప్పటికి రహదారులు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు విశాఖపట్నంలోని తగరపువలస గ్రామం ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ దరియల్‌ భూమ్‌ పుణ్యమా అని ఆ గ్రామానికి దారులు మూసుకుపోయాయి. 

అపదైనా... అత్యవసరమైనా నడకబాట తప్ప వాహనాలు వెళ్లని దుస్థితి.  పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సైతం తుప్పుల మధ్య  బితుకుబితుకు మంటూ కాలిబాటన వెళ్లాల్సిందే. జీవీఎంసీ భీమిలి జోన్‌  5వ వార్డు చిట్టివలస కళ్లాలు చుట్టూ వ్యవసాయభూములు కొన్నేళ్లుగా  బీడుభూములుగా మిగిలిపోయాయి. ఇటీవల వర్షాలకు పనికిరాని మొక్కలు మొలిచాయి. 

చిట్టివలస చెరువు నుంచి ఈ గ్రామానికి కిలోమీటరు దూరం. తుప్పలను జీవీఎంసీ తొలగించకపోవడంతో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. జీవీఎంసీ కూడా వీరి కష్టాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో రహదారి లేక పాఠశాలలకు వెళ్లే చిన్నారులు బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు వీరి కష్టాలపై స్పందిస్తారో లేదో చూడాలి. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top