స్కానింగ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో
స్కానింగ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలి
Dec 11 2013 3:23 AM | Updated on Sep 15 2018 3:43 PM
విజయనగరం ఆరోగ్యం,న్యూస్‌లైన్: స్కానింగ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఎస్‌పీహెచ్‌ఓలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్‌సీ సిబ్బందితో సమావేశం నిర్వహించి, వాటిలో చర్చించిన మినిట్స్ వివరాలను పంపించాలని కోరారు. జనవరి 19నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు.
ఇటుక బట్టీలు, ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న వలస కుటుంబీకుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది పోలియో కేసు నమోదు కాకుండా చూడగలిగితే పోలియో రహిత దేశంగా మన దేశాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటిస్తుందని చెప్పారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలన్నారు. ఇంటి ప్రసవాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో డీటీసీఓ రామారావు, డీఐఓ కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement