
వైభవంగా సంగమేశ్వర జాతర
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండలో కొలువైన సంగమేశ్వర స్వామి జాతర శనివారం వైభవంగా జరిగింది.
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండలో కొలువైన సంగమేశ్వర స్వామి జాతర శనివారం వైభవంగా జరిగింది. దాదాపు లక్షమంది భక్తులు జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించికున్నారు. జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.