విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాల బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా సమర్పిస్తున్నారు.
హైదరాబాద్: విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాల బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా సమర్పిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం, ఎమ్మెల్యే పదవులతో సహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలో మిగతా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు.
మంత్రి సాకే శైలజానాథ్ అధికారిక వాహనాన్ని వదిలి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వదిలి ఆటోలో వెళ్లిపోయారు. అయితే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం లేదు. కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు నిన్న రాజీనామా చేశారు.