నర్సీపట్నంలో భారీగా గంజాయి స్వాధీనం | Rs. 8.5 lakhs worth ganja seized in Narsipatnam | Sakshi
Sakshi News home page

నర్సీపట్నంలో భారీగా గంజాయి స్వాధీనం

Aug 30 2014 2:35 PM | Updated on Sep 2 2017 12:38 PM

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. రెండు వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 8.5 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement