లోకల్ మేనిఫెస్టో.. ఓటర్ల నమోదులో భాగస్వామ్యం.. ఎస్‌ఎంఎస్ క్యాంపెయిన్. మిగిలిన రాజకీయ నాయకులకు భిన్నంగా తోట చంద్రశేఖర్ చేపట్టిన కార్యక్రమాలివి.
రొటీన్‌కు భిన్నంగా..
Jan 23 2014 4:54 AM | Updated on Sep 5 2018 3:24 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : లోకల్ మేనిఫెస్టో.. ఓటర్ల నమోదులో భాగస్వామ్యం.. ఎస్‌ఎంఎస్ క్యాంపెయిన్. మిగిలిన రాజకీయ నాయకులకు భిన్నంగా తోట చంద్రశేఖర్ చేపట్టిన కార్యక్రమాలివి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకునిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వినూత్న కార్యక్రమాలతో జనంలోకి వెళుతూ ఆకర్షిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నిపార్టీల నాయకులు సాధారణంగా సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం, విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తారు. చంద్రశేఖర్ వాటితోపాటు విభిన్న కార్యక్రమాలు చేపడుతున్నారు.
లోకల్ మేనిఫెస్టో
తాజాగా ఆయన ప్రకటించిన లోకల్ మేనిఫెస్టో పూర్తిగా భిన్నంగా కనబడుతోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలను జాతీ య, రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోల పేరుతో విడుదల చేస్తాయి. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో కేజ్రీవాల్ నియోజకవర్గ మేనిఫెస్టోలు ప్రకటించారు. అదే తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేయడానికి చంద్రశేఖర్ కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరచాలో నిర్ణయించేందుకు భారీస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల 745 గ్రామాల్లో అభిప్రాయ సేకరణ కోసం నమూనాను రూపొందిం చారు. మూడు ప్రశ్నలతో కూడిన నమూనా ప్రతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా జనం ముందుకు తీసుకెళ్లి వారితో పూర్తి చేయించి తిరిగి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభిప్రాయాలు, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రశ్నలు ఈ నమూనాలో ఉన్నాయి. అభిప్రాయ సేకరణ అనంతరం వాటిన్నిం టినీ క్రోఢీకరించి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల సమస్యలపై చర్చ జరిగే అవకాశం కలుగుతుందని చంద్రశేఖర్ అంటున్నారు.
25 వేల కొత్త ఓటర్ల నమోదు
ఓటర్ల నమోదు కార్యక్రమంలోనూ చంద్రశేఖర్ కీల కంగా వ్యవహరించారు. రాజకీయ పార్టీలు ఓటర్ల నమోదులో పాల్గొంటున్నా అది నామమాత్రమే. చంద్రశేఖర్ మాత్రం ఇందుకోసం రెండు నెలల నుం చి ప్రత్యేకంగా పనిచేస్తూ బూత్‌కమిటీల ద్వారా ఓట ర్ల నమోదు చేయించారు. ప్రతి బూత్ కమిటీకి ఒక వలంటీర్‌ను అప్పగించి.. వారికి ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించి గ్రామాల్లోకి పంపారు. వారు ఓటు హక్కులేని వారిని గుర్తించి, పత్రాలు నింపి, తహసిల్దార్ కార్యాలయాలకు తీసుకెళ్లి ఓటర్లుగా చేర్పించారు. నియోజకవర్గమంతా ఓటర్ల నమోదుపై అవగాహన కోసం పోస్టర్లు సైతం వేయించారు. ఓటు హక్కు లేని వారు దానిని పొందాలని కోరుతూ ప్రజలకు ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. ఇలా చంద్రశేఖర్ స్వయంగా పార్టీ బూత్ కమిటీ సభ్యుల ద్వారా 25 వేల కొత్త ఓటర్లను చేర్పించడం విశేషం. ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
Advertisement
Advertisement