వరద ప్రాంతాల్లో మరమ్మతులు | Repairs to flood areas | Sakshi
Sakshi News home page

వరద ప్రాంతాల్లో మరమ్మతులు

Sep 21 2013 12:48 AM | Updated on Sep 29 2018 5:21 PM

నాలుగేళ్ల క్రితం భారీ వరదలతో రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు, మంచినీటి పథకాలు, విద్యా సంస్థల శాశ్వత మరమ్మతులకోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,000 కోట్లు రుణం తీసుకునే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం భారీ వరదలతో రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు, మంచినీటి పథకాలు, విద్యా సంస్థల శాశ్వత మరమ్మతులకోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,000 కోట్లు రుణం తీసుకునే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 నెలల విరామం తరువాత శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పలు శాఖల్లో 5వేల పోస్టుల భర్తీకి, పలు సంస్థలకు భూముల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
 
 విజయవాడ విమానాశ్రయం విస్తరణ కోసం 491.92 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో 433 ఎకరాల ప్రైవేట్ స్థల సేకరణకోసం రూ. 110.91 కోట్లు మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం ఆమోదించిన ఇతర ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.
     వరంగల్, రాజమండ్రి, హైదరాబాద్ కారాగారాల్లో మహిళా ఖైదీలకు ప్రత్యేక జైళ్ల ఏర్పాటు, మంగళగిరి, అనంతపురం, ఒంగోలు, చిత్తూరులలో సబ్ జైళ్ల ఏర్పాటు. ఇందుకోసం 36 పోస్టుల భర్తీ.
     ఆర్థిక శాఖలో రెగ్యులర్ 6, కాంట్రాక్ట్ విధానంలో 11 పోస్టుల భర్తీ.
     రాష్ట్ర సమాచార కమిషన్ కోసం 38 పోస్టులు
     వరంగల్, కాకతీయ విశ్వవిద్యాయు ఇంజనీరింగ్ కాలేజీ కోసం 37 బోధన, 8 బోధనేతర సిబ్బంది నియూవుకం.
     రవాణా శాఖలో 392 పోస్టుల భర్తీ.
     చిత్తూరు జిల్లా వాల్మీకిపురం బాలికల గురుకుల పాఠశాలకు 23 పోస్టు లు, వరంగల్‌లోని చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 19 పోస్టుల భర్తీ.
     అవినీతి నిరోధక శాఖలో మొత్తం 47 పోస్టుల భర్తీ.
     రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు కింద ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు. 2,825 టీచర్ పోస్టుల భర్తీ
     జెన్‌కోలో 1,105 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ ఆస్తి పన్ను బోర్డులో 28 పోస్టుల భర్తీకి ఆమోదం.  
     మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ఇఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు, 15 పోస్టుల భ ర్తీ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఇఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు, 13 పోస్టుల భర్తీ. ప్రకాశం జిల్లా మార్టూరులో ఇఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు.16 పోస్టుల భర్తీ.
     నెల్లూరు జిల్లాలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కోసం 43 బోధన, 45 బోధనేతర సిబ్బంది, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పి.జి. సెంటర్ ఏర్పాటు, 31 పోస్టులు, కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయం కోసం 18 బోధన, 9 బోధనేతర పోస్టుల భర్తీ.
     చిత్తూరు జిల్లా మహల్‌లో ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు, కాలేజీలో 16 పోస్టుల భర్తీ. మెదక్ జిల్లా జోగిపేటలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, 25 పోస్టుల భర్తీ.
     గత నిర్ణయాలకు అనుగుణంగా కలికిరి, చీపురుపల్లి, పెబ్బేర్, పెందుర్తి, టెక్కలి, పిఠాపురం, మేడ్చల్‌లలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు.
     విజయవాడ లో ప్లానింగ్, అర్కిటెక్చర్ సంస్థ ఏర్పాటుకు 9.66 ఎకరాల ప్రభుత్వ భూమి విక్రయుం
     కృష్ణా జిల్లా జయంతీపురంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు 498 ఎకరాలు ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకి అప్పగింత. నెల్లూరు జిల్లా  సిరసనంబేడులో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు 176 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు, పరిశోధనా సంస్థ ఏర్పాటుకోసం ఇదే జిల్లా, ఒగ్గూరులో 51ఎకరాలు, చిట్టేడులో 58ఎకరాలు జాతీయ ఓషన్ టెక్నాలజీ సంస్థకు అప్పగింత.
     కృష్ణా జిల్లా బలమూరు మండలం జింకుంటలో లెదర్ పార్కు ఏర్పాటునకు 25ఎకరాల ప్రభుత్వ స్థలం లిడ్‌క్యాప్‌కు అప్పగింత.
     కర్నూలు జిల్లా రాచర్లలో పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం 32 ఎకరాల ప్రభుత్వ భూమి గ్రామీణ విద్యుత్ అభివృద్ధి సంస్థకు అప్పగింత.
     కరీంనగర్ జిల్లా చొప్పదొండి మండలం రుక్మాపూర్ గ్రామంలో ఎపిఎస్‌పి 17వ బెటాలియన్ కోసం 124 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. ఇదే మండలంలోని కంతేపల్లిలో మినీ లెదర్ పార్కు  ఏర్పాటు కోసం 40 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయింపు
     వరంగల్ జిల్లా హన్మకొండలో మత్స్య భవన్ నిర్మాణం కోసం 17 గుంటల ప్రభుత్వ స్థల విక్రయుం. ఇదే జిల్లాలోని ఘన్‌పూర్‌లో లెదర్ పార్కు ఏర్పాటుకు 25 ఎకరాల భూమి విక్రయం.
     దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో వుర ణించిన చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ కుటుంబానికి షేక్‌పేట్ వద్ద 538 చదరపు గజాల స్థలం కేటాయింపు.
     ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్‌ర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గ కమిటీ ఆమోదం  పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తంచేస్తూ, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement