ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మంగళవారం భేటీ అయ్యారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మంగళవారం భేటీ అయ్యారు. వారి మధ్య చర్చలో రాష్ట్ర విభజన, భద్రాచలం, హైదరాబాద్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. భద్రాచలాన్ని ఏ ప్రాంతంలో ఉంచాలనే అంశంపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఎలాంటి సిఫార్సు చేస్తుందనేదానిపై వారు చర్చించినట్లు తెలిసింది.
చిత్తూరు జిల్లాలో నేడు సీఎం పర్యటన
ముఖ్యమంత్రి కిరణ్ బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి గురువారం ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా.. ముఖ్యమంత్రి ఈ నెల 24న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సింగనమల నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 21నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నా జీవోఎం అదే రోజు తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్‌కు సమర్పించనున్నట్లు సమాచారం ఉండడంతో సీఎం ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసుకున్నారు. మంత్రి శైలజానాథ్ మంగళవారం సీఎంతో భేటీ అయిన తరువాత మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కూడా కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి జిల్లా పర్యటనపై చర్చించారు.