చెరుకు గెడల అడుగున పెద్ద ఎత్తున్న ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని నెల్లూరు జిల్లా రాపూర్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.
చెరుకు గెడల అడుగున పెద్ద ఎత్తున్న ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని నెల్లూరు జిల్లా రాపూర్ సమీపంలో చిట్వేలీ గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనంతరం లారీని రాపూర్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు. డ్రైవర్పై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.