వైఎస్ఆర్ కడప జిల్లా బాలుపల్లి అటవీప్రాంతంలోని కందుమడుగు వద్ద పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా 9 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు.
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా బాలుపల్లి అటవీప్రాంతంలోని కందుమడుగు వద్ద పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా 9 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను సీజ్ చేసి, కూలీలను పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందన విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిన్న బద్వేలు సమీపంలోని లంకమల్ల అభయారణ్యంలో ఎర్రచందనం భారీ డంప్ను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎర్రచందనం తరలించేందుకు దాదాపు 150 మంది కూలీలు అడవిలో నక్కి ఉన్నారు ... ఫారెస్ట్ అధికారుల కూంబింగ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆ కూలీలంతా పరారైన సంగతి తెలిసిందే.