శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.
చంద్రగిరి (చిత్తూరు) : శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే .. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలోని పగడగుండాల కోన వద్ద గురువారం సాయంత్రం 35 ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు.
విషయం తెలిసిన 11వ బెటాలియన్ పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లారు. వారిని చూసి దాదాపు 40 మంది కూలీలు దుంగలను వదిలి పరారయ్యారు. ఈ దాడిలో పట్టుబడిన తమిళనాడుకు చెందిన రామచంద్రన్, చిన్న రాజా అనే కూలీలను అదుపులోకి తీసుకుని, చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.