పోలవరం ప్రాజెక్టు అధారిటీ కమిటీ సమావేశాలు ఇక ముందు రాజమహేంద్రవరంలోనే జరగాలని, అవసరమైన కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు
పోలవరం : పోలవరం ప్రాజెక్టు అధారిటీ కమిటీ సమావేశాలు ఇక ముందు రాజమహేంద్రవరంలోనే జరగాలని, అవసరమైన కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావును జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజెన్సీ అతిథి గృహంలో మంత్రి రెవెన్యూ, పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువల ఇంజినీరింగ్ అదికారులతోను, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. కుడి, ఎడమ కాలువల తవ్వకం పనులను ప్యాకేజ్‌ల వారీగా సమీక్షించారు. ప్రాజెక్టు డిజైన్‌లు త్వరగా రూపొందించేందుకు సీడబ్ల్యూసీ రిటైర్డ్ ఇంజీనీరింగ్ అధికారులు, నిపుణులతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి వరద ఎంత వస్తుంది, ఇబ్బంది లేకుండా పనులు ఎలా చేయాలి? అనే దిశగా అధికారులు ఆలోచన చేయాలన్నారు.
2018 నాటికి ప్రాజెక్టు పూర్తికావాలి
కుడి కాలువను ఈ ఏడాది మే నెలాఖరుకు, ఎడమ కాలువను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 నాటి కి పూర్తి చేసే విధంగా పనులు చేయాలన్నారు. ఎడ మ కాలువ నిర్మాణంలో మూడు కట్టడాలు హైవే మీద నిర్మాణం చేయాలని అధికారులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోను 58వ కి.మీ వద్ద ఏలేరు రిజర్వాయర్ వరకు కాలువ నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
అక్కడ నుంచి కాలువ ద్వారా విశాఖకు నీరు వెళస్త్ల్ర అవకాశం ఉందన్నారు. పట్టిసీమ స్ఫూర్తితో పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రారంభోత్సవానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని తీసుకు వస్తామన్నారు. ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్టును జూన్ 2018 నాటికి పూర్తి చేసేలా పనిచేస్తామన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ అమలు తీరును కలెక్టర్ కె.భాస్కర్ వివరించారు. నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రి పీతల సుజాత, ఎంపీ టి.సీతా రామలక్ష్మి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.