ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే | rachamallu siva prasad reddy clarification | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే

May 28 2017 12:47 PM | Updated on May 29 2018 2:33 PM

ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే - Sakshi

ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే

తాను టీడీపీలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి వాపోయారు.

ప్రొద్దుటూరు: తాను టీడీపీలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి వాపోయారు. తాను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే తనకు ప్రేమ, అభిమానాలు  ఉన్నాయన్నారు. వైఎస్‌ జగన్‌ అంటే కృతజ్ఞత కూడా ఉందని చెప్పారు. ఇకనైనా తనపై దుష్ప్రచారం ఆపాలని కోరారు.

టీడీపీ ప్రభుత్వం అక్రమాలపై రాచమల్లు తన గళాన్ని గట్టిగా విన్పిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా అధికార టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నించారు.  తన చెప్పుతో తానే కొట్టుకుని ప్రభుత్వ దౌర్జన్యాలను ఎండగట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement