కాకినాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు
కాకినాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా
ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. వారి దుశ్చర్యలతో అమాయకులైన గిరిజనులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. పోలవరం నిర్మాణ
ప్రాంతం, ముంపు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు అదుపుచేసేందుకు అదనపు బలగాలు మోహరించామన్నారు. పోలవరం
లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించే అవకాశం పోలీసులకు ఇన్నాళ్లకు వచ్చినందుకు అందరూ సంతోషించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన 2015 పోలీస్ డైరీని ఆవిష్కరించారు.