'బాయిలింగ్ స్టార్ ఇరగదీశాడు'

'బాయిలింగ్ స్టార్ ఇరగదీశాడు'


 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.. అంటూ ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క డైలాగ్తో ప్రేక్షకుల హృదయాలను చకిలగింతలు పెట్టిన నటుడు పృథ్వీరాజ్ . గోపిచంద్ హీరోగా తాజా విడుదలైన 'లౌక్యం' చిత్రంలో పృథ్వీరాజ్ టీవీ యాంకర్ పాత్రలో ఒదిగిపోయారు. 'బాయిలింగ్ స్టార్ బబ్లూ' పాత్రలో పృథ్వీ ఇరగదీశాడంటూ అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  ఆ పాత్రలో ఒదిగిపోయి తీరు... డైలాగులు పలికిన విధానంతోపాటు నటన అద్భుతంగా ఉన్నాయని పృథ్వీని సీని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.పృథ్వీ పాత్ర లౌక్యం చిత్రానికే హైలైట్ అని ప్రేక్షక్షులు తెలుపుతున్నారు. గోపిచంద్, రుకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించి లౌక్యం గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనుప్ రుబెన్స్ సంగీతం అందించారు. సినిమా మధ్యమధ్యలో ఎక్కడైనా కాస్త ఇబ్బందిగా అనిపించినా వెంటనే మళ్లీ పృథ్వీ రంగప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని సినిమా రివ్యూలు కూడా చెబుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top