మంత్రిగారికి సెల్ఫోన్ చిక్కులు | prattipati pullarao suffers with phone calls | Sakshi
Sakshi News home page

మంత్రిగారికి సెల్ఫోన్ చిక్కులు

Dec 17 2014 5:16 PM | Updated on Oct 1 2018 2:00 PM

మంత్రిగారికి సెల్ఫోన్ చిక్కులు - Sakshi

మంత్రిగారికి సెల్ఫోన్ చిక్కులు

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన సూచన వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చిక్కులు తెచ్చిపెట్టింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన ప్రకటన..వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చిక్కులు తెచ్చిపెట్టింది. రుణమాఫీ జాబితాపై ఏవైనా సమస్యలుంటే మంత్రి పుల్లారావుకు ఫోన్ చేయాలంటూ రఘువీరా ఆయన ఫోన్ నెంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత మూడు రోజులుగా రైతుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్కు మంత్రి ఇబ్బంది పడుతున్నారట. రైతులు తమ సమస్యలు గురించి మంత్రికి ఏకరువు పెడుతున్నారు. రైతుల ఫోన్ కాల్స్కు సమాధానం చెప్పలేక మంత్రి అవస్థలు పడుతున్నారు. ఒక్క ఫోన్ కాల్కు సమాధానం చెప్పేలోపే 10 మిస్డ్ కాల్స్ వస్తున్నాయంటూ మంత్రి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement